Vettaiyan: 'వేట్టయన్' ట్విట్టర్ X రివ్యూ.. రజనీకాంత్ ఇన్వెస్టిగేషన్ కాప్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Vettaiyan: 'వేట్టయన్' ట్విట్టర్ X రివ్యూ.. రజనీకాంత్ ఇన్వెస్టిగేషన్ కాప్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) 170 మూవీ 'వేట్టయన్-ద హంటర్' (Vettaiyan) ఇవాళ గురువారం (అక్టోబర్ 10న) థియేటర్లో భారీ అంచ‌నాల మధ్య రిలీజైంది. జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ (Tj Gnanavel) తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ కాప్ డ్రామాలో బిగ్ బి అమితాబ్‌బ‌చ్చ‌న్‌, రానా ద‌గ్గుబాటి, ఫ‌హాద్ ఫాజిల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. కాగా పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ మూవీ ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో ట్విట్టర్ X రివ్యూలో తెలుసుకుందాం. 

క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా డైరెక్టర్ టీజే జ్ఞాన‌వేళ్ వేట్ట‌య‌న్ మూవీని తనదైన శైలిలో రూపొందించినట్లు సోషల్ మీడియాలో నెటిజన్స్ 
మాట్లాడుకుంటున్నారు. ‘ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు.. ఇలాంటి మగ మృగాలను ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో చంపేయాలి అంటూ స్టూడెంట్స్‌‌‌‌ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్‌‌‌‌ ట్రైలర్ లో చూపించిన మాదిరిగానే సినిమా పవర్ ఫుల్ గా సాగిందని పోస్టులు పెడుతున్నారు.

ALSO READ | ‘శ్వాగ్’ కంటెంట్ విషయంలో ప్రౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫీలవుతున్నాం

ఎన్‌కౌంట‌ర్లు చ‌ట్టానికి లోబ‌డే జ‌రుగుతుంటాయా? ఎన్‌కౌంట‌ర్ల‌ను న్యాయ‌వ్య‌వ‌స్థ స‌మ‌ర్థిస్తుందా? వ్య‌తిరేకిస్తుందా? అనే అంశాల‌ను క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి డైరెక్టర్ వేట్ట‌య‌న్ మూవీలో ఎమోషనల్ గా చూపించినట్లుగా ఉందని పోస్టులు పెడుతున్నారు. 

వేట్టయన్ మూవీ ఫస్టాఫ్ అదిరిపోయింది. మాస్‌ను మించిన కంటెంట్ ఉంది. తొలి 25 నిమిషాల్లో రజనీకాంత్ యాక్టింగ్ గూస్ బంప్స్, బీజీఎం, రీరికార్డింగ్ అనిరుధ్ కెరీర్ బెస్ట్ గా ఇచ్చిపడేశాడు. తలై ఇంట్రో మ్యూజిక్ సూపర్‌గా ఉంది. ఎమోషనల్ క్రైమ్,ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. 

వెట్టయన్ ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ గా సాగింది. రజినీకాంత్ అతని మాస్ మూమెంట్స్.. తలైవా చేసే రేసీ నేర పరిశోధనతో స్క్రీన్‌ప్లే థ్రిల్లింగ్ గా ఉంది. ఫ‌హాద్ ఫాజిల్ (ఫాఫా) సూపర్ ఫన్ ఇచ్చేశాడు.  అనిరుధ్ బీజీఎం, సాంగ్స్ అదిరిపోయాయి. ఎమోషన్స్ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 

వెట్టయన్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది.. సినిమా బాగుంది.. రజినీకాంత్‌ను ఇలా చూపిస్తారని అనుకోలేదు.. అద్భుతంగా ఉన్నాడు.. ఇంత వరకు ఇలా చూపించలేదు.. ప్రతీ ఫ్రేమ్ అదిరిపోయింది.. ఇక సెకండాఫ్ కోసం ఫుల్ వెయిటింగ్ అని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. జైలర్ ఫస్ట్ హాఫ్ కంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందని అంటున్నారు. ఇక అనిరుధ్ తన ఆర్ఆర్‌తో అదరగొట్టేశాడని చెబుతున్నారు. బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని, సాంగ్ ప్లేస్ మెంట్ కూడా బాగుందని ట్వీట్లు పెడుతున్నారు. ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ అదిరిపోతుందని చెబుతున్నారు.

వెట్టయన్ ఫస్ట్ హాఫ్  సూపర్బ్.. సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ మూమెంట్స్ జరుపుకోవడానికి మొదటి 20 నిమిషాలు అదిరిపోయింది. మూవీ అరగంట తర్వాత నేర పరిశోధనతో నిండిన స్క్రీన్‌ప్లే రేసీ వైపు కదులుతుంది. అనిరుధ్ బీజీఎం, రీరికార్డింగ్ అండ్ ఒక సాంగ్  చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. దుషారా కీలక పాత్ర పోషిస్తుంది, ఫాఫా సూపర్ ఫన్ ఇచ్చేసాడని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. 

ర‌జ‌నీకాంత్‌కు ధీటుగా అమితాబ్‌బ‌చ్చ‌న్ పాత్ర ఉంటుంద‌ని అంటున్నారు. ర‌జ‌నీకాంత్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్ క‌లిసి స్క్రీన్‌పై క‌నిపించే సీన్స్ అదుర్స్ అని చెబుతున్నారు. పోలీస్ ఇన్ఫార్మ‌ర్ గా ఫ‌హాద్ ఫాజిల్‌క్యారెక్ట‌ర్‌ ఫ‌న్నీగా ఉంటుంద‌ని, న‌వ్విస్తూనే త‌న యాక్టింగ్‌తో ఫ‌హాద్ ఫాజిల్ ఆక‌ట్టుకుంటాడ‌ని చెబుతున్నారు. రానా ద‌గ్గుబాటి, దుషారా విజ‌య‌న్ క్యారెక్ట‌ర్స్ స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటాయ‌ని అంటున్నారు.

అయితే, ఈ సినిమాకు విజయ్ ఫ్యాన్స్ అయితే నెట్టింట్లో మరీ దారుణంగా కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్‌తో పోటి పడిన ప్రతీ సారి రజినీకాంత్ చిత్రం భారీ లాస్‌లను తెచ్చి పెట్టిందని అంటున్నారు. ఇక విజయ్ ఫ్యాన్స్ #VettaiyanDisaster అని ట్రోలింగ్‌లో రజినీ వేట్టయన్‌కు భారీ డ్యామేజ్ జరిగేలా ఉంది. మరి ఈ మూవీ అసలు టాక్ తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.