Rajinikanth: వావ్..తలైవర్ డ్యాన్స్ అదిరింది..అనిరుధ్‌తో కలిసి రజనీ హుషారైనా స్టెప్పులు

Rajinikanth: వావ్..తలైవర్ డ్యాన్స్ అదిరింది..అనిరుధ్‌తో కలిసి రజనీ హుషారైనా స్టెప్పులు

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) వేట్టైయాన్ (Vettaiyan) అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళ్ దర్శకుడు టీజె జ్ఞానవెల్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బాలీవుడ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రానా దగ్గుబాటి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తీ చేసుకుంది.  

అయితే తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవించందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇటీవలే  వేట్టైయన్ చిత్రంలోని మానసిలియో సాంగ్ యూట్యూబ్లో విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో భాగంగా వేట్టైయన్ ఆడియో & ప్రీవ్యూ ఈవెంట్ సెప్టెంబర్ 20న చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్.

ఈ కార్యక్రమంలో మానసిలియో సాంగ్కి మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌తో కలిసి రజనీ తనదైన స్టెప్పులతో డ్యాన్స్‌ వేసి సందడి చేశారు. తలైవర్ వేసే డ్యాన్స్ కి అక్కడున్న వారందరూ ఫిదా అయ్యారు. ఎంతో జోష్ గా, హుషారుగా అనిరుధ్ కి పోతే పడి మరి రజినీ డ్యాన్స్ వేసాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read :- క్రిమినల్స్ను కుమ్మేస్తున్న రజనీ కాంత్‍

ఆడియో రిలీజ్‌లో రజనీకాంత్‌ మాట్లాడుతూ..అనిరుధ్‌ తనకు కుమారుడితో సమానమన్నారు. ‘సందేశాత్మక చిత్రం తీయాలని డైరెక్టర్ జ్ఞానవేల్‌తో చెప్పాను. ఆయన వెంటనే ఈ కథతో నన్ను సంప్రదించారు. ఇది ప్రజలంతా సెలబ్రేట్‌ చేసుకునే చిత్రం. ఇందులో అన్ని విధాలైన భావోద్వేగాలు ఉంటాయి. నా గత చిత్రం ‘జైలర్‌’కు భారీ ప్రేక్షకాదరణ వచ్చింది. ఈ సినిమాను కూడా అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఈ సినిమాకు అనిరుధ్‌ మంచి సంగీతం అందించారు’ అని ప్రశంసించారు. 

కాగా వేట్టైయన్ ఆడియో విడుదల కార్యక్రమానికి రజనీకాంత్, అనిరుధ్ రవిచందర్, రానా దగ్గుబాటి, దుషారా మరియు రితికా సింగ్ తదితరులు హాజరయ్యారు. అక్టోబర్‌ 10న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో వేట్టైయన్ విడుదల కానుంది.