
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘కూలీ’.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని మేకర్స్ చెప్పారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది.
రజినీకాంత్ నటించిన హిట్ చిత్రాల్లో ఒకటైన ‘బాషా’రేంజ్‌లో ఈ మూవీ ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుందని, ఇరవై రెండు నిమిషాలున్న ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. అలాగే ఇందులో వింటేజ్ రజినీని చూడొచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో రజినీ అభిమానులంతా హిస్టరీ రిపీట్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఈ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్.. ‘కూలీ’ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియా నుంచి కొంత బ్రేక్ తీసుకుంటున్నట్టు మంగళవారం పోస్ట్ చేయడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
Hey guys!
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) April 22, 2025
I'm taking a small break from all the social media platforms until #Coolie's promotions
With Love,
Lokesh Kanagaraj 🤜🏼🤛🏼
గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజినీకాంత్ దేవ అనే పాత్రను పోషిస్తున్నారు. ఆయన కెరీర్‌లో ఇది 171వ సినిమా. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్, మహేంద్రన్, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కీలకపాత్రలు పోషిస్తుండగా, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, రజినీకాంత్ లుక్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.