Rajinikanth: రజనీకాంత్ కూలీ షూటింగ్ కంప్లీట్.. వీడియో రిలీజ్ చేసిన మేకర్స్.. రిలీజ్ డేట్ ఇదే!

Rajinikanth: రజనీకాంత్ కూలీ షూటింగ్ కంప్లీట్.. వీడియో రిలీజ్ చేసిన మేకర్స్.. రిలీజ్ డేట్ ఇదే!

రజినీకాంత్ - లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ మూవీ కూలీ. తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రజినీతో పాటు చిత్ర బృందంతో కలిసి ఉన్న ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఈ క్రేజీ అప్డేట్ తలైవా ఫ్యాన్స్కి మస్త్ ఖుషి ఇస్తుంది. ఎందుకంటే, ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ వేల కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇందులో మొదటిసారిగా తలైవా స్మగ్లర్‌గా కనిపించనున్నారు. దీంతో లోకేష్ తనదైన మేకింగ్తో తలైవాని ఎలా చూపించనున్నాడో అని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

ఇకపోతే, ఈ మూవీ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఆగస్ట్ 14న పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుందని టాక్. అంతేకాకుండా, సెప్టెంబర్ మరియు అక్టోబర్‌లలో కొన్ని విడుదల తేదీలను మేకర్స్ పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రజినీ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. నాగార్జున, ఉపేంద్ర,  శ్రుతిహాసన్, సత్యరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు

Also Read :- ఎంపురాన్ ట్రైలర్ చూసిన రజనీకాంత్

గోల్డ్ మాఫియా బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కిన ఈ సినిమాకుగాను రజినీ దాదాపు రూ.260 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇండియాలో తీసుకున్న రెమ్యునరేషన్ లో ఇదే హైయెస్ట్ కావడం విశేషం. ఇక దర్శకుడు లోకేష్ కూడా రూ.60 కోట్ల రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఇప్పుడీ ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఇది కదా తలైవర్ క్రేజ్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.