జైలర్(Jailer) సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth). చాలా రోజుల తరువాత ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అనుకున్నారు రజిని. ఈ సినిమా అందించిన ఊపుతోనే ఇప్పుడు వరుసగా క్రేజీ సినిమాలను లైన్లో పెడుతున్నారు సూపర్ స్టార్. అందులో భాగంగా ఇప్పటికే టీజీ జ్ఞానవేల్(TG Gnanavel) తో వెట్టయ్యాన్ సినిమాను మొదలుపెట్టిన ఆయన.. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) తో మరో సినిమాను మొదలుపెట్టారు.
తాజాగా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ టైటిల్ టీజర్ ను అనౌన్స్ చేసింది. ఇన్నాళ్లు తలైవార్ 171(Thalaivar 171) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కూలీ అంటూ మాస్ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు టైటిల్ వీడియో కూడా రిలీజ్ చేస్తూ సూపర్బ్ కిక్ ఇచ్చారు. టీజర్ లో బంగారు వాచీలతో కూడిన కొంతమంది గ్యాంగ్ స్టార్స్ ను చితక్కొట్టిన కూలీగా రజిని కనిపిస్తున్నారు. ఆయన లుక్, ఆ స్వాగ్ అదిరిపోయింది. మూడు నిముషాలు పాటు ఉన్న ఈ టీజర్ ని యాక్షన్ కట్ తో రెడీ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి.. సినిమా పై భారీ అంచనాలనే క్రియేట్ చేసారు. మరి ఆ టీజర్ ని మీరు కూడా చూసేయండి.
టీజర్ ఒక్కమాటలో చెప్పాలంటే..లోకేష్ కనగరాజ్ స్టైల్ లో నెక్స్ట్ లెవల్లో ఉంది. ఎందుకంటే ఇపుడు లోకేష్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదొక బ్రాండ్. తీసింది కేవలం ఐదు సినిమాలే కానీ, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో తన సినిమాలకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. అందుకే ఆయన సినిమాలపై చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు ఆడియన్స్.ఇక కూలీతో మరో బ్లాక్ బాస్టర్ ను అందుకోవడం కన్ఫమ్.