జైలర్ సక్సెస్తో సూపర్ స్టార్ రజనీ కాంత్ (Rajinikanth) నెక్స్ట్ తన170 మూవీ వెట్టయన్ - ద హంటర్' తో గురువారం (అక్టోబర్ 10న) థియేటర్లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
పవర్ ప్యాకెడ్ కాప్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో వచ్చాయనే ఆసక్తి ఆడియన్స్ లో నెలకొంది. అయితే.. రజనీకాంత్ గతేడాది నటించిన జైలర్ మూవీ కంటే వెట్టయన్ వసూళ్లు చాలా తక్కువే అని చెప్పాలి.వివరాల్లోకి వెళితే..
ప్రముఖ Sacnilk.com బాక్సాఫీస్ ప్రకారం.. భారీ అంచనాల మధ్య రిలీజైన వెట్టయన్ మూవీకి..ఇండియా వైడ్గా రూ.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అందరూ ఊహించినట్లే తమిళంలోనే అత్యధికంగా రూ.26.15 కోట్లు రాగా.. తెలుగులో రూ.3.2 కోట్లు, హిందీలో రూ.0.6 కోట్లు, కన్నడలో రూ.0.05 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మార్నింగ్ షోలలో 53.95 శాతం ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం షోలలో 53.51 శాతం, ఈవినింగ్ షోలలో 54.43 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
వెట్టయన్ కి.. వరల్డ్ వైడ్గా రూ.65కోట్లుకు పైగా (గ్రాస్) వసూలు చేసినట్లు సమాచారం. ఇకపోతే వెట్టయన్ రజనీకాంత్ కెరీర్‌లో 4వ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. మొదట 2.0, కబాలి మరియు జైలర్ వంటి అతిపెద్ద బాక్సాఫీస్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించాయి.
గతేడాది రజనీ నటించిన జైలర్ మూవీ ఫస్ట్ డే ఇండియా వైడ్గా రూ.48 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ.72 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాతో పోలిస్తే.. వెట్టయన్ మూవీకి చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అయితే, ప్రస్తుతం కొన్నిచోట్ల మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చిన వీకెండ్ లో తన సత్తా చూపిస్తోంది అని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కోలీవుడ్‌లో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా వెట్టయన్ రికార్డు నెలకొల్పింది. దళపతి విజయ్ ‘ది గోట్’ మొదటి స్థానంలో (120 కోట్లు) సాధించింది.