ప్రతి సీన్ ఎంజాయ్ చేసేలా.. వేట్టయాన్

ప్రతి సీన్ ఎంజాయ్ చేసేలా.. వేట్టయాన్

రజినీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్‌‌‌‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  చిత్రం ‘వేట్టయాన్‌‌‌‌  ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.  అక్టోబర్ 10న  సినిమా విడుదలవుతున్న క్రమంలో శుక్రవారం  చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. 

రజినీకాంత్ మాట్లాడుతూ ‘జ్ఞానవేల్‌‌‌‌ రూపొందించిన ‘జై భీమ్’ చూశా. నాకు బాగా నచ్చింది. మెసేజ్ సినిమాలు తీసే ఆయన నాతో  కమర్షియల్ సినిమా తీస్తారా అని ఆలోచించా. కానీ తను చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో  డెవ‌‌‌‌ల‌‌‌‌ప్ చేయ‌‌‌‌మ‌‌‌‌ని చెప్పా. రెండు రోజుల తర్వాత కాల్ చేసి లోకేష్‌‌‌‌, నెల్సన్ స్టైల్‌‌‌‌లో క‌‌‌‌మ‌‌‌‌ర్షియ‌‌‌‌ల్ సినిమా చేయ‌‌‌‌లేను.. తన  స్టైల్లో  చేస్తాన‌‌‌‌ని చెప్పారు. నాకు కూడా అదే కావాల‌‌‌‌ని అన‌‌‌‌టంతో ఈ స్క్రిప్ట్‌‌‌‌ రెడీ చేశారు. అమితాబ్ గారు కూడా ఓకే చేయడంతో నాలో ఉత్సాహం మరింత పెరిగింది. ఎందుకంటే ప‌‌‌‌ర్సన‌‌‌‌ల్‌‌‌‌గానూ ఆయన నాకు ఇన్‌‌‌‌స్పిరేష‌‌‌‌న్. తర్వాత ఫహాద్ ఫాజిల్, రానా యాడ్ అవడం కథ స్థాయిని పెంచింది. సినిమా పెద్ద విజయం సాధించి  జ్ఞాన‌‌‌‌వేల్ ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాల‌‌‌‌ని కోరుకుంటున్నా’ అన్నారు.

ర‌‌‌‌జినీకాంత్‌‌‌‌తో కలిసి నటించడం గ‌‌‌‌ర్వంగా భావిస్తున్నా అని అమితాబ్ అన్నారు. అభిమానులు ఊహించిన దానికి మించి ఉంటుందని, ప్రతి చిన్న మూమెంట్‌‌‌‌ను ఎంజాయ్ చేస్తారని దర్శకుడు జ్ఞాన‌‌‌‌వేల్ చెప్పాడు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో భాగమవడం ఆనందంగా ఉందని నటులు రానా, మంజు వారియర్, అభిరామి, రితికా సింగ్, దుసారా విజయన్ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సినిమాటోగ్రాఫ‌‌‌‌ర్ ఎస్‌‌‌‌.ఆర్‌‌‌‌.క‌‌‌‌దిర్, నిర్మాత భరత్ నారంగ్ పాల్గొన్నారు.