Rajinikanth: మనవడిని స్వయంగా స్కూల్‌కు తీసుకెళ్లి..క్లాస్ రూమ్‌లో ముచ్చటించిన సూప‌ర్ స్టార్‌ రజినీకాంత్ ..

Rajinikanth: మనవడిని స్వయంగా స్కూల్‌కు తీసుకెళ్లి..క్లాస్ రూమ్‌లో ముచ్చటించిన సూప‌ర్ స్టార్‌ రజినీకాంత్ ..

రజినీకాంత్ అంటే ఏంటో చెప్పటానికి. తన జీవితం గురించి..తను జీవితం ఎలా మొదలైంది అనేది చెప్పుకోవటానికి ఎప్పుడూ సిగ్గుపడని సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క రజినీకాంత్ మాత్రమే.ఎంతో సాధారణ జీవితాన్ని గడిపే రజినీ లాంటి వ్యక్తులు వేలలో ఒకరుంటారేమో అనిపిస్తోంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండే రజినీకాంత్ ఇప్పుడు గ్రాండ్‌ఫాదర్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ రోజు (జూలై 26న) స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తున్న తన మనవడిని స్వయంగా స్కూల్ కి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రజినీ కుమార్తె సౌందర్య ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు.

ఈ మేరకు "ఈ రోజు ఉదయం నా కుమారుడు వేద్‌ (Ved) స్కూల్‌కి వెళ్లాలని అనుకోలేదు..ఇక తన సూపర్‌హీరో తాత తనని స్వయంగా స్కూల్‌కి తీసుకెళ్లాడు..పోషించే ప్రతి పాత్రలోనూ మీరే బెస్ట్ నాన్న..అది ఆన్ మరియు ఆఫ్ స్క్రీన్ మై డార్లింగ్ అప్పా..'బెస్ట్ గ్రాండ్ ఫాదర్..బెస్ట్ ఫాదర్..జస్ట్ ది బెస్ట్" అంటూ పోస్ట్ చేసింది.

అంతేకాదు.. మ‌నువ‌డి క్లాస్ రూమ్‌కి వెళ్లిన ర‌జినీకాంత్‌ అక్క‌డ ఉన్న ఇత‌ర పిల్ల‌ల‌ను సంతోష‌పెట్టార‌ని సౌందర్య చెప్పింది. ఇది ఏ తాత చేయని ప్రపంచ రికార్డు అని కొందరు స‌రదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్‌ తన కుమారుడిని పాఠశాలకు తీసుకెళ్తున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే..జైలర్ సక్సెస్తో రజనీ కాంత్‍ తన నెక్స్ట్ మూవీపై  ఫోకస్ పెట్టాడు. తలైవా170 మూవీ వెట్టయాన్‌గా (తెలుగులో వేటగాడు) వస్తోన్న ఈ మూవీని జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ (Tj Gnanavel) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అలాగే, త‌మిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ ’కూలీ’ మూవీతో పాటుగా మరిన్ని చర్చల దశలో ఉన్నాయి.