జైలర్ సక్సెస్తో సూపర్ స్టార్ రజనీ కాంత్ (Rajinikanth) నెక్స్ట్ తన170 మూవీ వెట్టయన్ - ద హంటర్' (Vettaiyan) తో దసరా సందర్బంగా గురువారం (అక్టోబర్ 10న) థియేటర్లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
పవర్ ప్యాకెడ్ కాప్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం..దసరా ఉండడం కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో వెట్టయన్ మూవీకి బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏ రేంజ్లో వచ్చాయనే ఆసక్తి ఆడియన్స్లో నెలకొంది. ఈ చిత్రం రిలీజైన 5 రోజుల్లోనే రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, ఈ సంవత్సరంలో అత్యధికంగా వసూలు చేసిన భారతీయ సినిమాలలో ఒకటిగా నిలిచింది. కాగా ఈ మూవీ సోమవారానికి రూ.110 కోట్ల మేరకు నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
బాక్సాఫీస్ లెక్కలు:
ఈ క్రమంలో మేకర్స్ సోమవారం (అక్టోబర్ 14న) పోస్టర్ రిలీజ్ చేస్తూ.. "వెట్టయన్ ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇంకా లెక్కింపులో ఉంది! తలైవర్ ఆధిపత్యానికి అవధులు లేవు. వేట కొనసాగుతోంది!" అంటూ తెలిపారు.
అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్‌గా విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది అనేది బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఎందుకంటే రజనీకాంత్ గత చిత్రం జైలర్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా అతికొద్ది రోజుల్లోనే రూ.450 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. కనుక వేట్టయన్ మూవీకి అంతకు మించిన వసూళ్లు వస్తాయని ఫ్యాన్స్ బలంగా కోరుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.240 కోట్లకి పైగా వసూళ్లు మాత్రమే నమోదు చేయడం ఇందుకు కారణమైంది. అంతేకాకుండా వెట్టయన్ బడ్జెట్ రూ.160 కోట్లు అని సమాచారం. ఇకపోతే లాంగ్ రన్‌లో అయినా జైలర్ వసూళ్లను క్రాస్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
VETTAIYAN 🕶️ crosses 240+ crores worldwide and still counting! 🤩 Thalaivar's dominance knows no bounds. 🔥 The hunt continues! 🦅 #VettaiyanRunningSuccessfully 🕶️ in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran… pic.twitter.com/Y5gLyk8gsC
— Lyca Productions (@LycaProductions) October 14, 2024
రెమ్యునరేషన్ లెక్కలు:
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు రజనీకాంత్ ఏకంగా రూ.125 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అలాగే బిగ్ బి అమితాబ్ రూ.7.5 కోట్లు. అంటే అమితాబ్ బచ్చన్ కంటే 17 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నాడు రజనీ. రానా కు రూ.5 కోట్లు, మంజు వారియర్ కి రూ.2.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. గురు ఫేమ్ రితిక సింగ్ మాత్రం కేవలం రూ.50 లక్షల లోపు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫహద్ ఫాసిల్ 2 నుండి 4 కోట్ల వరకు అందుకున్నట్లు సమాచారం.దీన్ని బట్టి చూస్తే.. వెట్టయన్ కమర్షియల్‌గా సక్సెస్ అవ్వాలంటే లాంగ్ రన్ లో వేగంగా పరుగెత్తాల్సిన అవసరం ఉంది.