తలైవర్ 170..సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చిన రజనీకాంత్

 జైలర్ సక్సెస్తో రజనీ కాంత్‍(Rajinikanth) తన నెక్స్ట్ మూవీపై  ఫోకస్ పెట్టాడు. తలైవా170 (Thalaivar170) గా వస్తోన్న ఈ మూవీని జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్(Tj Gnanavel) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లేటెస్ట్గా ఈ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తలైవా170 మూవీ షూటింగ్  మొదలైనట్లు..రజినీ పోస్టర్ ను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసింది. బ్లాక్ షర్ట్, బ్లాక్స్ గ్లాసెస్ తో..రజనీ ఇంటెన్స్ లుక్స్ అదిరిపోయింది.  దీంతో రజనీ మేకోవర్ లుక్ ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవొచ్చు. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన స్టార్ యాక్టర్స్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా చెన్నై ఎయిర్ పోర్ట్లో సడన్ గా కనిపించిన రజనీ మీడియాతో తన 170వ మూవీ గురుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు.

రజనీ మాట్లాడుతూ..జై భీమ్ డైరెక్టర్ టి.జి జ్ఞానవేల్‌ డైరెక్షన్ లో చేస్తున్న మూవీ సొషల్ మెసేజ్ తో తెరకెక్కనుంది. ఈ మూవీకి ఇంకా టైటిల్‌ డిసైడ్ అవ్వలే.  ఇవాళ (October 4) షూటింగ్ ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. మంచి కంటెంట్ ఉన్న సామాజిక సందేశం అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తుంది..అని రజనీ చెప్పారు. ఈ మూవీ కోసం రజనీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రీసెంట్గా ఈ మూవీలో చాలా కీలకమైన రోల్స్ కోసం బిగ్ బి అమితాబ్, టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా(Rana Daggubati), మలయాళ స్టార్ హీరో ఫహద్‌ ఫాజిల్(Fahadh Fazil) జాయిన్ అయ్యారు. అలాగే హీరోయిన్స్ గా మంజూ వారియర్‌ (Manju Warrier), రితికా సింగ్‌ (Ritika Singh), దుషారా విజయన్‌ (Dushara Vijayan) ముగ్గరు హీరోయిన్స్ నటిస్తున్నట్లు పోస్టర్స్ రిలీజ్ చేశారు. 

జై భీమ్ మూవీతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన డైరెక్టర్ జ్ఞాన వేల్ తలైవర్ 170 కోసం భారీ ప్లాన్ చేసినట్లు కోలీవుడ్ టాక్. ఈ మూవీలో రజినీ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. రజనీకి జోడీగా దీపికా పదుకునే నటిస్తున్నట్లు టాక్. జైలర్ తో ఎలెక్ట్రిఫయింగ్ మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్ లో కీలకమైన ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్ల టార్గెట్ దిశగా రానున్న ఈ మూవీ 2024 సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.