సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తీవ్ర కడుపునొప్పితో సోమవారం అర్థరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్‌కు కార్డియాక్ క్యాథ్ ల్యాబ్‌లో ముగ్గురు వైద్య నిపుణుల బృందం శస్త్రచికిత్స పూర్తిచేసినట్లు తెలుస్తోంది.
మంగళవారం ఉదయం (ఆక్టోబర్ 1న) వైద్యులు ఆయన పొత్తికడుపులో స్టెంట్ వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. మరో మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియకు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ నాయకత్వం వహించారు.
ఇవాళ మంగళవారం సాయంత్రం తర్వాత రజినీకాంత్ ను కార్డియాక్ ఐసియు నుండి నార్మల్ వార్డుకు తరలించాలని ప్లాన్ చేస్తున్నారు వైద్యులు. కాగా లోకేష్ కనగరాజ్ 'కూలీ' చిత్రీకరణలో ఉన్నప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా రజినీ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే, రజనీకాంత్ ఆకస్మికంగా ఆసుపత్రిలో చేరడంతో దేశవ్యాప్తంగా అభిమానులలో కలకలం రేపింది. దీంతో సోషల్ మీడియాలో రజినీ ఆరోగ్యాంగా తిరిగిరావాలని పోస్టులు పెడుతున్నారు.
Also Read :- అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్
ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ కూడా తన మద్దతును అందించారు, X లో పోస్ట్ చేస్తూ, “నా స్నేహితుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసుపత్రిలో చేరిన తర్వాత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.” అని తెలిపారు. ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరియు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నటుడు రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டுள்ள நண்பர் சூப்பர்ஸ்டார் திரு. @rajinikanth அவர்கள் விரைந்து நலம் பெற விழைகிறேன்.
— M.K.Stalin (@mkstalin) October 1, 2024