Jailer 2 shooting update: జైలర్ సీక్వెల్ మొదలెట్టేసిన రజనీకాంత్.. వేట మొదలైంది అంటూ..

Jailer 2 shooting update: జైలర్ సీక్వెల్ మొదలెట్టేసిన రజనీకాంత్.. వేట మొదలైంది అంటూ..

సూపర్ స్టార్ రజినీకాంత్, యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఫాదర్ సెంటిమెంట్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా దాదాపుగా రూ.700 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించాడు. ఎలివేషన్ అండ్ ఎమోషన్ సీక్వెన్స్ లో బీజియం కీ రోల్ ప్లే చేసింది. ఇటీవలే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుందని అఫీషియల్ గా ప్రకటించాడు. 

అయితే జైలర్ 2 సినిమా షూటింగ్ సోమవారం మొదలైందని మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇందులోభాగంగా జైలర్ 2 కి సంబందించిన పోస్టర్ ని కూడా షేర్ చేశారు. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఐతే జైలర్ సినిమాలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శిరవరాజ్ కుమార్ తదితర స్టార్ హీరోలు గెస్ట్ అప్పియరెన్స్ పాత్రల్లో నటించారు. దీంతో తమిళ్ తోపాటు హిందీ, కన్నడ, మలయాళం తదితర భాషల్లో కూడా జైలర్ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. ఈసారి జైలర్ 2లో టాలీవుడ్ నుంచి కూడా మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం... ఇందులో ఎక్కువగా నందమూరి బాలకృష్ణ పేరు వినిపిస్తోంది.

ALSO READ | Sharukh Khan: ఐటీ ట్యాక్స్ కేసులో స్టార్ హీరోకి బిగ్ రిలీఫ్..

ఈ విషయం ఇలా ఉండగా సెకెండ్ ఇన్నింగ్స్ హీరో రజినీకాంత్ ఎక్కువగా యాక్షన్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆమధ్య వచ్చిన వేట్టయాన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం రజినీకాంత్ ప్రముఖ తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న కూలీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కనడ నటుడు ఉపేంద్ర, టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, తదితరులు గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.