జైలర్ 2 టీజర్ రిలీజ్: రజినీకాంత్ ఊచకోత.. మూములుగా లేదు అసలు..!

సంక్రాంతి పండుగ వేళ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది జైలర్ మూవీ టీమ్. యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. రజినీ కెరీర్‎లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిల్చిన  జైలర్ మూవీకి అఫిషియల్‎గా స్వీకెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. గత కొన్ని రోజులుగా మూవీ సర్కిల్స్‎లో జరుగుతోన్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా అధికారికంగా జైలర్ 2 అనౌన్స్‎మెంట్ టీజర్‎ను విడుదల చేసింది చిత్ర బృందం. 

4 నిమిషాల నిడివితో స్వీకెల్ అనౌన్స్ టీజర్‎ను కట్ చేయగా.. ఇందులో తలైవా వీర విహారం చేశారు. జైలర్ సినిమాలో మాదిరిగానే స్వీకెల్‎లో కూడా శత్రువులను ఊచకోత కోస్తారని టీజర్‎ను చూసి తేలిపోయింది. జైలర్ 2 అనౌన్స్ మెంట్ టీజర్‎లో రజినీ ఎలివేషన్స్ వేరే లెవల్. ఇక జైలర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే చెప్పనవసరమే లేదు. ఆ రేంజ్‎లో ఊర్రుతాలూగించింది బీజీఎం. సీక్వెల్ టీజర్‎లోనూ అదే బీజీఎం ఆకట్టుకుంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన జైలర్ 2 మూవీ 2025లోనే విడుదల కానుంది. 

ALSO READ | The RajaSaab: రాజాసాబ్ నుంచి న్యూ పోస్టర్.. రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడిందా..?

 కళానిథిమారన్ నిర్మాణంలో సన్ పిక్చర్స్ బ్యానర్‎లో తెరకెక్కిన జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ ఇలా.. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ స్టార్ యాక్టర్స్ నటించిన చేసిన విషయం తెలిసిందే. సాలిడ్ హిట్ లేక నిరాశలో ఉన్న రజినీకి ఈ సినిమా అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన జైలర్ సినిమా.. దాదాపు 700 కోట్ల గ్రాస్ వసూల్ చేసి రజినీకాంత్‎ కెరీర్‎తో పాటు తమిళ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 

జైలర్ 2 బ్లాక్ బస్టర్ కొట్టడంతో మూవీ యూనిట్ వెంటనే స్వీకెల్ అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగానే ఇవాళ సంక్రాంతి పండుగ సందర్భంగా సీక్వెల్ అనౌన్స్ మెంట్ టీజర్ విడుదల చేసి రజినీ అభిమానులకు పండుగను డబుల్ చేసింది మూవీ యూనిట్. జైలర్ సినిమాలో మాదిరిగానే జైలర్ 2లో కూడా వివిధ ఇండస్ట్రీలకి చెందిన బడా బడా స్టార్లు యాక్ట్ చేయనున్నట్లు టాక్. దీంతో జైలర్ 2 మూవీ కోసం తలైవా ఫ్యాన్స్ ఈగర్‎గా వెయిట్ చేస్తున్నారు.