సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)అతిథి పాత్రలో కనిపిస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సలామ్( Lal Salaam). తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్(Aishwarya Rajinikanth) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు ఐశ్వర్య. లాల్ సలామ్ నుంచి లేటెస్ట్ గా సాలీడ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నఈ మూవీ వచ్చే ఏడాది 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. స్పెషల్ గా రిలీజ్ డేట్ను మెన్షన్ చేయలేదు. అయితే ఇప్పటికే పలు స్టార్ హీరోల మూవీస్ సంక్రాంతి రేసులో ఉన్నాయి. దీంతో లాల్ సలామ్ మూవీ కూడా సంక్రాంతికి వస్తుండటంతో తీవ్ర పోటీ నెలకొంది.
ఐశ్వర్య రజినీకాంత్ దాదాపు 6 ఏళ్ళ తరువాత డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. క్రికెట్ నేపథ్యంలో లాల్ సలాం రూపొందుతోందని సినిమా అనౌన్స్ చేసినప్పుడు వెల్లడించారు మేకర్స్. అయితే... క్రికెట్ ఒక్కటే కాదని, ఈ సినిమాలో క్రికెట్ నేపథ్యంలో జరిగిన అల్లర్లు కూడా ఉంటాయని సమాచారం.
అలాగే నటి జీవిత రాజశేఖర్ కూడా లాల్ సలామ్ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తుండగా, రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, రజినీ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశాడు.
ఇందులో మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజినీ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఆయన లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ 171వ చిత్రాన్ని రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దీన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుంది.
Also Read :- యానిమల్.. ఒకవేళ ప్లాప్ అయితే?
LAL SALAAM to hit ? screens on PONGAL 2024 ?☀️✨
— Lyca Productions (@LycaProductions) October 1, 2023
? @rajinikanth
? @ash_rajinikanth
? @arrahman
? @TheVishnuVishal & @vikranth_offl
? @DOP_VishnuR
⚒️ @RamuThangraj
✂️?️ @BPravinBaaskar
? @NjSatz
?️ @RIAZtheboss @V4umedia_
??️ @kabilanchelliah
? @gkmtamilkumaran… pic.twitter.com/4XOg3sozSs