ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ అనుకోలేదు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రజనీ మక్కల్ మండ్రమ్‌కు చెందిన ఆఫీస్ బేరర్లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తన పార్టీ పాలసీల గురించి మాట్లాడారు. తన రాజకీయ ప్రవేశంపై 15 ఏళ్లుగా అనేక ఊహాగానాలు వచ్చాయని ఆయన అన్నారు. ఇక దానిపై స్పందించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ‘నేను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నా రాజకీయ ప్రవేశంపై 15 ఏళ్లుగా అనేక ఊహాగానాలు వచ్చాయి. రాజకీయాల్లోకి యువరక్తం రావాలి. ప్రజల మనస్తత్వం మారాలి. అలాగే వ్యవస్థలో కూడా మార్పు రావాలి. జయలలిత మరణం తర్వాత రాజకీయ అస్థిరత ఏర్పడింది. రాజకీయ నాయకులకు ప్రజలంటే కేవలం ఓట్లే. 2017లో నా రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చాను. తమిళనాడు పరిస్థితులను విశ్లేషించడం మొదలు పెట్టాను. సమయానికి తగ్గట్టు పరిపాలన ఉండటం లేదు. నాకు 3 ప్రణాళికలు ఉన్నాయి. అత్యధిక మంది నా పార్టీలో భాగస్వాములయ్యేలా చూస్తా. నా పార్టీలో నిధుల దుర్వినియోగం ఉండదు. నా పార్టీలో 65 శాతం యువతకే ప్రాధాన్యం ఇస్తా. ప్రభుత్వ వ్యవహారాల్లో పార్టీ అధ్యక్షుడి ప్రమేయం ఉండకూడదు. ప్రభుత్వం, పార్టీలపై ఒకే వ్యక్తి పెత్తనం సరికాదు. నేనేప్పుడూ సీఎం కావాలని అనుకోలేదు. నిజాయితీపరులకే సీఎం పీఠం దక్కాలి. నేను కేవలం పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటా’నని రజనీకాంత్ అన్నారు.

For More News..

కరోనా ఎఫెక్ట్: చికెన్‌, మటన్‌లకు ప్రత్యామ్నాయం దొరికింది

సినీ దంపతులకు కరోనా వైరస్