అమరన్కు రజినీకాంత్ గ్రీటింగ్స్

అమరన్కు రజినీకాంత్ గ్రీటింగ్స్

శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘అమరన్’ చిత్రాన్ని రజినీకాంత్ అభినందించారు. తాజాగా ఈ సినిమా చూసిన ఆయన.. చిత్ర  నిర్మాతల్లో ఒకరైన తన మిత్రుడు కమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాసన్‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి అభినందనలు తెలియజేశారు. అలాగే, హీరో శివకార్తికేయన్, దర్శకుడు రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్ , నిర్మాత ఆర్. మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్ సాయిని ప్రత్యేకంగా కలిశారు.  సినిమా కథ, కథనం, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయని టీమ్‌‌‌‌‌‌‌‌ అందరినీ ప్రశంసించారు.