అందుకే యోగీ కాళ్లు మొక్కాను : రజినీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath holding) కాళ్ళు పట్టుకోవడం దేశవ్యాప్తంగా చర్చనియ్యాంశం అయ్యింది. రజనీకాంత్ లాంటి వ్యక్తి ఆయన కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అనే కామెంట్స్ కూడా వినిపించాయి. వయసులో తనకంటే చిన్నవాడైనా యోగి కాళ్లను తాకాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు కూడా వినిపించాయి. అంతేకాదు ఈ విషయంపై టీవీలలో డిబేట్స్ కూడా నడిచాయి. అయితే ఈ కామెంట్స్ రజనీకాంత్ వరకు చేరడంతో.. తాజాగా ఈ విషయంపై స్పందించాడు రజని.      

ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యోగులు, సన్యాసిలు, బాబాల పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోవడం నా ముందునుండే అలవాటు. వారు నా కంటే వయసులో చిన్నవారైనా నేను ఆ పని చేస్తాను. అందుకే యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించాను. అందులో అంతకు మించి వేరే ఉద్దేశ్యం లేదు అని తెలిపారు రజని. దీంతో ఆయనపై వస్తున్న వార్తలకు చెక్ పడింది. 

Also Read :- ప్ర‌పంచ వృద్ధుల దినోత్స‌వం.. పెద్ద వాళ్ల‌తో ఇలా గ‌డ‌పండి.. ఇలా చూసుకోండి.. టెన్ష‌న్ రిలీఫ్

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ భారీ విజయాన్ని సాధించింది. ఆగష్టు 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం 10 రోజుల్లోనే రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన రజని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది జైలర్ మూవీ. ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది ఈ సినిమా.