Rajinikanth Birthday Special: బాబా సినిమా ఫ్లాప్ అవ్వడంతో భారీ నష్టాలు.. దాంతో రజినీకాంత్ అలా చేశాడట..

Rajinikanth Birthday Special: బాబా సినిమా ఫ్లాప్ అవ్వడంతో భారీ నష్టాలు.. దాంతో రజినీకాంత్ అలా చేశాడట..

Rajinikanth Birthday Special: తమిళ్, తెలుగు భాషలలో వరుస సినిమాలు చేస్తూ సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు రజినీకాంత్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఏకంగా గవర్నమెంట్ హాలిడే ఇచ్చేది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు రజనీకాంత్ క్రేజ్ గురించి. అయితే ఈరోజుతో రజనీకాంత్ 74 ఏళ్ళు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. 

 సాధారణ బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ లైఫ్ నేటితరం యువ నటీనటులకి ఆదర్శం అని చెప్పవచ్చు. అయితే 1975లో ప్రముఖ సీనియర్ దర్శకుడు కే.బాల చందర్ దర్శకత్వం వహించిన "అపూర్వ రాగంగల్" సినిమాతో కెరీర్ ఆరంభించాడు. ఇప్పటివరకూ దాదాపుగా 170 సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలో ఎన్నో వార్డులు, రివార్డులు, సత్కారాలు అందుకున్నాడు. రజనీకాంత్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి కొన్ని సినిమాలని నిర్మించాడు. ఈ క్రమంలో నష్టం వచ్చిన సినిమాలకి తనవంతుగా సహాయం కూడా చేశాడు.

అయితే రజనీకాంత్ 2002 లో బాబా అనే సినిమాలో  హీరోగా నటించాడు. అంతేగాకుండా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా కి ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వం వహించగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. అయితే దాదాపుగా రూ.17కోట్లు బడ్జెట్ తో తీసిన బాబా సినిమా కేవలం రూ.3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. 

దీంతో డిస్ట్రిబ్యూటర్లకి నష్టం రాకుండా రజినీకాంత్ తన రెమ్యునరేషన్ లో దాదాపుగా 25% శాతం వదులుకున్నాడు. నిర్మాత కూడా తానే కావడంతో ప్రొడక్షన్ హౌజ్ ఖర్చులలో కూడా కొంత నష్టం పూడ్చినట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ హీరోలు ఇలా ముందుకొచ్చి నిర్మాతల కష్టాలు అర్థం చేసుకుంటే అందరూ బావుంటారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్, వెట్టయన్ సినిమాలు బాక్సాఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇందులో జైలర్ సినిమా ఫ్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ కాగా రూ.650 కోట్లు (గ్రాస్) కలెక్షన్లు సాధించింది. ఇక వెట్టయన్ కూడా రూ.275 కోట్లు(గ్రాస్) పైగా కలెక్షన్లు సాధించింది. 

ప్రస్తుతం రజినీకాత్ "కూలీ" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. కూలీ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తదితరులు గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది.