రజనీకాంత్ సూపర్ హిట్ చిత్రం రీరిలీజ్ కి సిద్ధం...

రజనీకాంత్ సూపర్ హిట్ చిత్రం  రీరిలీజ్ కి సిద్ధం...

ప్రస్తుతం టాలీవుడ్ లో పాత చిత్రాల రీరిలీజ్ ట్రెండ్ బాగానే వర్కౌట్ అవుతోంది. దీంతో ఇదే ట్రెండ్ ని కోలీవుడ్ కూడా ఫాలో అవుతోంది.  హీరోల పుట్టిన రోజున కానుకగా సూపర్ హిట్ అయిన చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇటు ఆడియన్స్ అలాగే దర్శకనిర్మాతలు కూడా బాగానే లబ్ది పొందుతున్నారు. 

అయితే ప్రముఖ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ చిత్రాన్ని మళ్ళీ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సెప్టెంబర్ 20వ తారీఖున రజనీకాంత్ పుట్టిన రోజున ఇదే రోజు 4కే వర్షన్ తో శివాజీ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. అయితే కేవలం శివాజీ చిత్రాన్ని కేవలం తమిళ్ లో మాత్రమే విడుదల చేస్తున్నట్లు సమాచారం. 

ఈ విషయం ఇలా ఉండగా శివాజీ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్. శంకర్ దర్శకత్వం వహించగా స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రం దేశంలో లంచం, అవినీతి నిర్మూలన బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించగా బాక్సాఫీస్ సూపర్ హిట్ గా నిలిచి రూ.100 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.