సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)ప్రత్యేక పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Lal Salaam). రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్(Aishwarya Rajinikanth) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్(Vikranth) హీరోలుగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజయి..ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ఇప్పుడు ఈ మూవీ శుక్రవారం (ఏప్రిల్ 12)నుంచి సన్ నెక్ట్స్ (SunNXT) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు తమిళ కొత్త ఏడాది కూడా ఉండటం విశేషం.మొత్తానికి రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ప్రస్తుతం స్టార్ సినిమాలు ఏవైనా రిలీజైన నెల రోజుల లోపే వస్తుండటం కామన్ అయిపొయింది. కానీ,లాల్ సలామ్ మాత్రం ఇదిగో వస్తుంది..అదిగో వస్తుంది అంటూ మేకర్స్ ఊరిస్తూ రావడంతో తలైవా ఫ్యాన్స్ కాస్త అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇక ఎట్టకేలకు రిలీజ్ డేట్ కూడా రావడంతో ఫ్యాన్స్
కథేంటంటే:
లాల్ సలామ్ పూర్తిగా 1990ల కాలంలో నడిచే కథ. హిందూ ముస్లింలు ఐకమత్యంగా సోదర భావంతో మెలిగే ఊరు కసుమూరు. అక్కడి నుంచి ముంబయి వెళ్లి గొప్ప వ్యాపార వేత్తగా ఎదుగుతాడు మొయిద్దీన్ (రజనీకాంత్). తన కొడుకు షంషుద్దీన్ (విక్రాంత్)ను క్రికెటర్‌ను చేయాలన్నది అతని కల. మొయిద్దీన్ ఊరు వదిలి వెళ్లాక కొందరు రాజకీయ నాయకుల కుట్రల వల్ల ఊళ్లోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోతారు. ఇక ఆ ఊళ్లో త్రీస్టార్ - ఎంసీసీ టీమ్స్ మధ్య జరిగే క్రికెట్ ఆట కూడా మతం రంగు పులుముకొని గొడవలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఒకరోజు మ్యాచ్ నడుస్తుండగా.. రెండు టీమ్స్ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలోనే షంషుద్దీన్ చేతిని నరికేస్తాడు గురు అలియాస్ గురునాథం (విష్ణు విశాల్). ఇంతకీ ఆ గురు మరెవరో కాదు మొయిద్దీన్ ప్రాణ స్నేహితుడి (ఫిలిప్ లివింగ్‌స్టోన్) తనయుడే. క్రికెట్‌లో జరిగిన ఆ గొడవ క్రమంగా మత కల్లోలంగా మారుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు క్రికెట్‌లో జరిగిన గొడవకు కారణమేంటి? షంషుద్దీన్ చేయి నరికేసేంత కోపం గురుకు ఎందుకొచ్చింది? తన కొడుకు చేయి నరికిన గురును మొయిద్దీన్ ఏం చేశాడు? ఊళ్లో జాతరకు ఈ కథకూ ఉన్న సంబంధం ఏంటి? ఊళ్లోని మత కల్లోలాలు ఎలా సద్దుమణిగాయి? అన్నది మిగతా కథ.