క్రికెటర్ హర్భజన్ గుండెపై రజనీకాంత్ టాటూ

క్రికెటర్ హర్భజన్ గుండెపై రజనీకాంత్ టాటూ
  • రజనీకాంత్ 71వ జన్మదినం సందర్భంగా భజ్జీ వెరైటీ విషెస్ 

టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆదివారం (డిసెంబర్ 12)న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 71వ జన్మదినం సందర్భంగా వెరైటీగా శుభాకాంక్షలు తెలియజేశాడు. రజనీకాంత్ అంటే తనకు ఎంత అభిమానమో అర్థమయ్యేలా గుండెపై టాటూను వేసుకుని బర్త్‌ డే విషెస్‌ చెబుతూ.. ఆ ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేశాడు. భజ్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 
‘నా గుండెపై సూపర్ స్టార్‌ను వేయించుకున్నాను. రజనీకాంత్ 1980వ దశకంలో బిల్లాగా.. 1990లలో బాషాగా.. ఇటీవలి కాలంలో అన్నాత్తే (పెద్దన్న)గా అలరించారు.. సూపర్ స్టార్‌కు ఇవే నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అంటూ తమిళ్‌లో రాసుకొచ్చాడు. హర్భజన్ సింగ్ తమిళ్‌లో చేసిన ట్వీట్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులే కాదు తమిళ భాషాభి మానులు కూడా ఫిదా అయిపోతున్నారు. హర్భజన్ షేర్‌ చేసిన ఫోటోను లైకులు, షేర్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ20 ఐపీఎల్‌లో కొన్ని సీజన్లు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతనిధ్యం వహించిన హర్భజన్ సింగ్ రజనీకాంత్ అంటే తనకు ఎలాంటి అభిమానమో ఇప్పుడు అందరికీ తెలిసేలా షేర్ చేయడం హాట్ టాపిక్ అయింది.