కూలీ దేవాగా.. రజినీకాంత్

రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. నాగార్జున, ఉపేంద్ర,  శ్రుతిహాసన్, సత్యరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కీలకపాత్రలకు సంబంధించిన క్యారెక్టర్స్‌‌‌‌ను రివీల్ చేసిన మేకర్స్, సోమవారం రజినీకాంత్ పాత్రను పరిచయం చేశారు.

ఇందులో ఆయన ‘దేవా’ అనే పాత్రను పోషిస్తున్నట్టు  తెలియజేస్తూ, పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్‌‌‌‌ వైట్‌‌‌‌లో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో రైల్వే కూలీలు చేతికి కట్టుకునే నెంబర్‌‌‌‌‌‌‌‌ ప్లేట్‌‌‌‌పై 1421 అనే నెంబర్‌‌‌‌‌‌‌‌ను చూపిస్తూ ఇంటెన్స్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపిస్తున్నారు రజినీ. ఇక ‘దేవా’ అనగానే ఆయన నటించిన ‘దళపతి’ చిత్రంలోని మమ్ముట్టి పాత్ర గుర్తొస్తుంది.