'తన జీవితం గురించి..తను జీవితం ఎలా మొదలైందనేది' చెప్పుకోవటానికి ఎప్పుడూ సిగ్గుపడని హీరో ఎవరైన ఉన్నారంటే.. అది ఒక్క రజినీకాంత్ (Rajinikanth) మాత్రమే. ఎంతో సాధారణ జీవితాన్ని గడిపే రజినీ లాంటి వ్యక్తులు వేలలో ఒకరుంటారేమో అనిపిస్తోంది. కొన్నిసార్లు ఆలోచిస్తే అసలు ఎవ్వరూ ఉండరేమో అనిపిస్తోంది.
ఎందుకంటే, చిన్న సక్సెస్ వస్తేనే నేల మీద కూడా నడవని వారుంటారు. ఇంకాస్తా పెద్ద సక్సెస్ వస్తే.. అసలు చేసిన ప్రయాణం కూడా గుర్తుకు రాని వాళ్ళు ఉంటారు. అందులో అందరికీ పూర్తి భిన్నమైన వ్యక్తి రజినీకాంత్ ఒకరని చెప్పడంలో సందేహం లేదు. ఇవాళ గురువారం రజినీకాంత్ పుట్టినరోజు (డిసెంబర్ 12న) తన 74వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం మీ కోసం.
ఒక మామూలు కండక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగిన సూపర్‌స్టార్ రజినీకాంత్ గురువారం తన 74వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన వ్యక్తిత్వం మరియు ఐకానిక్ స్టైల్‌తో అభిమానులను ఎప్పుడు ఆకర్షిస్తూనే ఉన్నారు రజినీ. వయసు పెరిగే కొద్దీ తనదైన స్టయిల్ తో.. మేనరిజంతో అభిమానుల ఆకలి తీరుస్తున్నాడు. మరపురాని డైలాగ్‌లు మరియు అసాధారణమైన నటనతో సినీ కళామతల్లికి చెరగని సంతకం చేశారు 'తలైవర్'.
Also Read:-ఇంక ఊరుకోను.. వారిని కోర్టు మెట్లెక్కిస్తా.. సాయి పల్లవి మాస్ వార్నింగ్..
నేడు తలైవర్ బర్త్డే స్పెషల్గా చెన్నైలోని ఆయన నివాసం ముందు బ్యానర్లు, రజినీ ఫోటోలు పట్టుకొని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అలాగే మదురైలోని ఆలయాల్లో అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రజినీకాంత విగ్రహాలకు పాలాభిషేకం చేస్తున్నారు. రజినీ పుట్టిన రోజు వేడుక అంటే తమిళనాడులో పండుగ కంటే తక్కువ కాదు. గతేడాది మధురైలో, అభిమానులు రజినీకాంత్ 15 అడుగుల పొడవు, 73 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ సంప్రదాయం ఈ ఏడాది 2024 కూడా కొనసాగుతుందని సమాచారం.
రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఆయన డిసెంబర్ 12, 1950లో బెంగుళూరులోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించాడు. రజినీకాంత్ 1975లో తమిళంలో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. అయితే రజనీకి కెరీర్ ప్రారంభంలో కష్టాలు తప్పలేదు. అంచలంచెలుగా ఎదిగి సూపర్‌స్టార్ అవ్వడం వెనక ఉన్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకం. నేడు రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తలైవర్.. లోకేష్ కనగరాజు డైరెక్షన్లో కూలీ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ ఆడియన్స్ లో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
అంతేకాదు.. సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. ఇక టీజర్ లో రజిని వింటేజ్ లుక్స్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. శ్రుతీ హాసన్ ఈ సినిమాలో రజినీకాంత్ కూతురిగా కనిపించనుందట. ఆ తర్వాత జైలర్ 2 లో నటించనున్నారు. మరి ఈ క్రమంలోనే సెన్సేషనల్ హిట్ జైలర్ పార్ట్ 2 పై నేడు ఓ అప్డేట్ వస్తుందని టాక్.ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి రజినీకాంత్ 160 కి పైగా చిత్రాల్లో నటించారు.
అవార్డులు:
భారత సినిమా రంగానికి రజినీకాంత్ చేసిన సేవలకు గాను అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2016 లో పద్మవిభూషణ్ పురస్కారాన్నీ బహుకరించింది. ఆయనకు ఒక జాతీయ పురస్కారం, ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్మ్‌ఫేర్ పురస్కారంతో పాటు ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు తలైవా.