రజనీకాంత్ వేట్టైయాన్ చిత్రం ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్..

రజనీకాంత్ వేట్టైయాన్ చిత్రం ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్..

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టైయాన్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళ్ దర్శకుడు టీజె జ్ఞానవెల్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బాలీవుడ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రానా దగ్గుబాటి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తీ చేసుకుంది.  

అయితే తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవించందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇటీవలే   వేట్టైయన్ చిత్రంలోని మానసిలియో సాంగ్ యూట్యూబ్ లో విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆడియో లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వేట్టైయన్ ఆడియో & ప్రీవ్యూ ఈవెంట్ సెప్టెంబర్ 20న చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకి నుండి నిర్వహించబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

ALSO READ | దేవర చిత్రానికి కొరటాల శివ అన్ని కోట్లు తీసుకున్నాడా..?

వేట్టైయాన్ చిత్రం అక్టోబర్ 10వ తారీఖున తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ భాషలలో విడుదలవుతోంది. గత ఏడాది  రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ మంచి హిట్ అయ్యింది. దీంతో వేట్టైయాన్ చిత్రంతో హిట్ ట్రాక్ ని కొనసాగించాలని రజనీకాంత్ భావిస్తున్నాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.