ఆ స్టైలు, స్మైలు..వా వారేవా..వేట్టయాన్‌‌‌‌‌‌‌‌ మూవీ ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

ఆ స్టైలు, స్మైలు..వా వారేవా..వేట్టయాన్‌‌‌‌‌‌‌‌ మూవీ ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

రజినీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్‌‌‌‌‌‌‌‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వేట్టయాన్‌‌‌‌‌‌‌‌’. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.   అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  ప్రమోషన్స్‌‌ లో భాగంగా  సోమవారం ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  ‘‘మెరుపై వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. మడతపెట్టి వచ్చిండే..  ఆటకు వచ్చిండే నాటు బీటై వచ్చిండే..

వేటకత్తై వచ్చిండే.. వేటకు వచ్చిండే” అని శ్రీనివాస మౌళి రాసిన తెలుగు లిరిక్స్ ఆకట్టుకున్నాయి. మాస్ బీట్‌‌‌‌‌‌‌‌తో  అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాటను నకాష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేష్ పాడారు. ‘‘వా.. వా.. వారేవా.. ఆ స్టైలు, స్మైలు వావారేవా..’ అంటూ సాగిన ఈ పాటలో రజినీకాంత్ స్టైలిష్ గెటప్‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. మంజు వారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన చేసిన  డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. పోలీస్, న్యాయ వ్యవస్థల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న వరల్డ్‌‌ వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.