Vettaiyan: సినిమా రిలీజ్ ఇవాళే.. అపుడే రజనీకాంత్ 'వేట్టయన్' ఓటీటీ అప్డేట్!

Vettaiyan: సినిమా రిలీజ్ ఇవాళే.. అపుడే రజనీకాంత్ 'వేట్టయన్' ఓటీటీ అప్డేట్!

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) వేట్టయన్ (Vettaiyan) ఇవాళ రిలీజ్ అవ్వడంతో థియేటర్లో ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. తమిళ్ దర్శకుడు టీజె జ్ఞానవెల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రానా దగ్గుబాటి కీలకపాత్రల్లో నటించి మెప్పించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగానే.. వేట్టయన్ ఓటీటీ ప్లాట్‌ఫాంకి సంబంధించిన న్యూస్ బయటికి వచ్చింది. 

థియేటర్లో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ దక్కించుకున్నట్టు కోలీవుడ్ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే స్ట్రీమింగ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే ఓటీటీలో ప్రీమియర్ అవ్వాలంటే 50 రోజుల వ్యవధి ఉండాల్సిన ప్రాతిపదిక ఉంది. అంటే, కచ్చితంగా 8 వారాల తర్వాత వేట్టయన్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. 

ఇకపోతే ఈ సినిమాలో వేట్ట‌య‌న్ పోలీసులు అనే వారు హంట‌ర్స్‌లా కాకుండా స‌మాజానికి ప్రొటెక్ట‌ర్స్‌గా ఉండాల‌నే మెసేజ్ తో డైరెక్ట‌ర్ టీజే జ్ఞాన‌వేళ్ ఈస్టోరీని రాసుకున్నారు. అలా కొన్నిసార్లు ఆవేశంలో పోలీసులు తీసుకునే నిర్ణ‌యాలు ఎలాంటి ఊహించని ప‌రిణామాల‌కు దారితీస్తాయ‌న్న‌ది తనదైన కథనంతో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అలాగే ఆన్‌లైన్ ఎడ్యుకేష‌న్ సిస్ట‌మ్ పేరుతో ప్రసెంట్ సొసైటీలో జ‌రుగుతోన్న దోపీడిని మూవీలో అంత‌ర్లీనంగా చూపించడం ఆసక్తి కలిగిస్తోంది.

ALSO READ : Vettaiyan Review: 'వెట్టయన్‌' మూవీ రివ్యూ.. ర‌జ‌నీకాంత్ ఖాతాలో మరో హిట్ పడిందా?

ఈ మూవీలో రజినీకాంత్, అమితాబ్ హోరాహోరీ గా నటించారు. ‘న్యాయం అన్యాయం అయినప్పుడు న్యాయంతోనే సరిజేయాలి.. అంతేకానీ ఇంకో అన్యాయంతో కాదు’ అని ఎన్‌‌‌‌కౌంటర్స్‌‌‌‌ను వ్యతిరేకించే పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ స‌త్య‌దేవ్‌ గా అమితాబ్‌‌‌‌ కనిపించారు.

‘క్రైమ్ క్యాన్సర్ లాంటిదని, దాన్ని పెరగనివ్వకుండా, అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పేమీ కాదు’ అనుకునే ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌గా రజినీ నటించాడు. వీరిద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రజినీ డైలాగ్ డెలివ‌రీ, మ్యాన‌రిజ‌మ్స్ ఆక‌ట్టుకుంటాయి. స‌త్య‌దేవ్‌గా పాత్ర‌లో సెటిల్డ్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచాడు అమితాబ్‌. ఇద్ద‌రు స్క్రీన్‌పై క‌నిపించే సీన్స్ విజిల్స్ వేయిస్తాయి. ఆలస్యం ఎందుకు వేట్ట‌య‌న్ దసరా ఫెస్టివల్ ను ముందు థియేటర్లో జరుపుకుని.. ఆ తర్వాత ఓటీటీలో సరదాగా ఎంజాయ్ చేయండి.

  • Beta
Beta feature