VETTAIYAN : వేట్టైయాన్ ప్రివ్యూ టీజర్ రిలీజ్..క్రిమినల్స్ను కుమ్మేస్తున్న రజనీ కాంత్‍

VETTAIYAN : వేట్టైయాన్ ప్రివ్యూ టీజర్ రిలీజ్..క్రిమినల్స్ను కుమ్మేస్తున్న రజనీ కాంత్‍

జైలర్ సక్సెస్తో రజనీ కాంత్‍ (Rajinikanth) తన నెక్స్ట్ మూవీపై  ఫోకస్ పెట్టాడు.తలైవా170 మూవీ వెట్టయాన్‌ గా (తెలుగులో వేటగాడు) వస్తోన్న ఈ మూవీని జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ (Tj Gnanavel) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తీ చేసుకుంది. అక్టోబర్‌ 10న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచుతూ..వరుస పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'వెట్టయాన్' ఆడియో, ప్రివ్యూ వేడుకను సెప్టెంబర్ 20న చెన్నై లో గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. 

ఈ సందర్బంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌తో కలిసి రజనీ తనదైన స్టైల్ లో డ్యాన్స్‌ వేసి సందడి చేశారు. అలాగే ఈ వేదికపై వేట్టైయాన్ సినిమా తమిళ్ టీజర్ రిలీజ్ చేసారు. వేట్టైయాన్ ప్రివ్యూ పేరిట ఈ టీజర్ రిలీజ్ చేసారు.

ఫస్ట్ ప్రివ్యూ అంటూ వచ్చిన ఈ టీజర్ను గమనిస్తే..క్రిమినల్స్ను రూత్ లెస్గా ఎన్ కౌంటర్ చేసే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజనీకాంత్ కనిపించాడు. కాగా వీరిపై విచారణకు ఆదేశించిన పై అధికారిగా అమితాబ్ బచ్చన్ కనిపించాడు.

ఇక టీజర్ మొత్తం రజనీ,అమితాబ్ పైనే నడిపాడు దర్శకుడు, అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కుమ్మేసింది. త్వరలో తెలుగు టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. జైలర్ తో ఎలెక్ట్రిఫయింగ్ మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి కూడా బ్లాక్ బాస్టర్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు.అది ఫస్ట్ సింగిల్ తో ప్రూవ్ అయింది కూడా. ఇక సెకండ్ సింగిల్ ప్రాక్టీస్ ప్రోమో కూడా అదిరింది.

దాదాపు రూ.1000 కోట్ల టార్గెట్ దిశగా రానున్నట్లు సమాచారం.ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్, ఫాహద్‌ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.