జైలర్ సక్సెస్తో రజనీ కాంత్ (Rajinikanth) తన నెక్స్ట్ 170 మూవీ వెట్టయన్ తో రేపు థియేటర్లోకి వస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ సూర్యతో ‘జై భీమ్’ తీసి మెప్పించిన టీజే జ్ఞానవేల్ రజినీతో సోషల్ మెసేజ్ టచ్ ఉండేలా ఓ పవర్ ప్యాకెడ్ కాప్ థ్రిల్లర్ ని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ అండ్ ట్రైలర్ మొత్తం ఓ మహిళ హత్య చుట్టూనే తిరిగింది. దీంతో సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెరిగింది.
వెట్టయన్ అడ్వాన్స్ బుకింగ్స్:
ఇక అడ్వాన్స్ బుకింగ్స్ అటు ఓవర్సీస్, ఇటు తమిళనాడు లో భారీ స్థాయిలో జరుగుతున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘వేట్టయన్’ ఆశించినంతగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగట్లేదని సమాచారం. రిలీజ్ కు ఒక్కరోజు మాత్రమే ఉన్న కూడా కోటి రూపాయల అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టలేకపోయిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
వెట్టయన్ ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్:
వెట్టయన్ ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే.. సొంత రాష్ట్రమైన తమిళనాడులో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.73 కోట్లు జరగగా.. తెలుగు రాష్ట్రాల్లో రూ.17 కోట్ల మేరకు బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అలాగే మిగతా రాష్టాల్లో కలిపి (ఇండియా వైడ్) థియేట్రికల్ బిజినెస్ 25 కోట్లకు వరకు జరిగిందని తెలుస్తోంది. అంతేకాకుండా డొమెస్టిక్ రీజియన్‌తో పాటు, ఓవర్సీస్ బిజినెస్ 45 కోట్లకు లాక్ చేయబడింది. ఇక మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెట్టయాన్ రూ.160 కోట్ల బిజినెస్ జరిగింది.
Also Read:-సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ రిలిజ్.. ఆఫీసులకు సెలవు!
బ్రేక్ ఈవెన్ టార్గెట్:
ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మరియు బాక్సాఫీస్ హిట్‌గా నిలవాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.160+ కోట్ల షేర్.. లేదా 300+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాలి.అయితే, రజినీ ప్రీవియస్ జైలర్ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో వెట్టయన్ ఏ రేంజ్లో కలెక్షన్స్ చేస్తుందో ఉహించుకోవొచ్చు.
దాదాపు రూ.1000 కోట్ల టార్గెట్ దిశగా రానున్న ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్,ఫాహద్ ఫాజిల్,రానా,మంజు వారియర్,రితికాసింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.జైలర్ తో ఎలెక్ట్రిఫయింగ్ మ్యూజిక్ అందించిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.