రజినీకాంత్ వెట్టయన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?

రజినీకాంత్ వెట్టయన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?

సూపర్ స్టార్ రజినీకాంత్ వెట్టయన్ అనే చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 10న ప్యాన్ ఇండియా భాషలలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. 

మంజు వారియర్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషార విజయన్, అమితాబ్ బచ్చన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. రూ.160 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా రూ.320 కోట్లు (గ్రాస్) 
కలెక్ట్ చేసింది. 

అయితే ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన  అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. దీంతో ప్రైమ్ లో నవంబర్ 8 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషాలలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియోస్ అధికారికంగా ప్రకటించింది.