
జైలర్ సక్సెస్తో రజనీ కాంత్ (Rajinikanth) తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు. తలైవా170 మూవీ వెట్టయాన్ గా (తెలుగులో వేటగాడు) వస్తోన్న ఈ మూవీని జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ (Tj Gnanavel) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
రజినీ వెట్టయాన్ మూవీ షూటింగ్ కోసం చెన్నై నుంచి నిన్న(30 జనవరి)న రజినీకాంత్ కడప చేరకున్నారు. ప్రస్తుతం వెట్టయాన్ (తెలుగులో వేటగాడు) మూవీ షూటింగ్ వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం నిడుజువ్వి గ్రామ సమీపంలోని సానే పల్లె నాపరాయి గనిలో జరుగుతోన్న షూటింగ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గోన్నారు.
రజినీకాంత్కు విలన్ మధ్య జరిగే యాక్షన్ సీన్స్ ఇక్కడ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఎర్రగుంట్ల పురపాలక సంఘానికి చెందిన కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డికి చెందిన క్వారీలో ఈ వెట్టయాన్ షూటింగ్ జరుగుతుంది. మొత్తం రెండు రోజుల పాటు సాగే షెడ్యూల్ షూటింగ్ మొత్తం ఇక్కడే ప్లాన్ చేసుకున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల నుంచి సమాచారం.
Thalaivar recent video from AP ❤️?
— Rajini Soldiers (@RajiniSoldiers) January 31, 2024
#Vettaiyan | #LalSalaam pic.twitter.com/l1Q3oHDyHV
రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న ఆయన అభిమానులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సూపర్స్టార్రజినీ కాంత్ను చూడడానికి భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం ఈ షూటింగ్కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జై భీమ్ డైరెక్టర్ టి.జి జ్ఞానవేల్ డైరెక్షన్ లో చేస్తున్న మూవీ సొషల్ మెసేజ్తో తెరకెక్కనుంది.
One more video of #Thalaivar latest from #Vettaiyan shooting spot Yerrangutla district #AndhraPradesh
— Suresh balaji (@surbalutwt) January 31, 2024
?????#SuperstaraRajinikanth | #Rajinikanth | #Rajinikanth? | #Jailer | #LalSalaam | #LalSalaamFromFeb9 | #LalSalaamAudioLaunch | #Thalaivar171 | #superstar… pic.twitter.com/feLaZyGnDL
ఈ మూవీలో రజినీ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. రజనీకి జోడీగా దీపికా పదుకునే నటిస్తున్నట్లు టాక్. జైలర్ తో ఎలెక్ట్రిఫయింగ్ మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్ల టార్గెట్ దిశగా రానున్న ఈ మూవీ 2024 సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Lights ☀️ Camera ?️ Clap ? & ACTION ?
— Lyca Productions (@LycaProductions) October 4, 2023
With our Superstar @rajinikanth ? and the stellar cast of #Thalaivar170?? the team is all fired up and ready to roll! ?️
Hope you all enjoyed the #ThalaivarFeast ? Now it's time for some action! We'll come up with more updates as the… pic.twitter.com/gPUXsPmvEQ