
మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎల్ 2: ఎంపురాన్’. హీరో పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తుండటంతో పాటు కీలకపాత్ర పోషిస్తున్నాడు. సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు ఇది సీక్వెల్. ఈ మూవీ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఈ నేపథ్యంలో ఎంపురాన్ ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు డైరెక్టర్ పృథ్విరాజ్. తాజాగా తన ఆరాధ్య నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ 'ఎంపురాన్ ట్రైలర్ చూశారంటూ ప్రేక్షకులతో పంచుకున్నారు.
"ఎంపురాన్ ట్రైలర్ చూసిన మొదటి వ్యక్తి సూపర్ స్టార్ రజనీకాంత్".. ట్రైలర్ చూసిన తర్వాత మీరు చెప్పిన మాటలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను సార్. మాటలు సరిపోవు. "ఎల్లప్పుడూ మీ అభిమానిగా మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాను సార్ ." అంటూ పృథ్వీరాజ్ ట్వీట్ చేశారు. దీంతో రజనీకాంత్ అండ్ పృథ్విరాజ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
Also Read:-వేసవి వినోదాల సారంగపాణి జాతకం ఏప్రిల్ 18న విడుదల
పృథ్వీరాజ్ చెన్నైలోని రజనీకాంత్ ఇంట్లో ఆయనను కలిశారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా పృథ్వీరాజ్ చెన్నైలోనే ఉంటున్నాడు. అయితే, రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29 నుండి తాత్కాలిక విరామం తీసుకుని ఎంపురాన్ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇకపోతే, మార్చి 20, 2025న కేరళలోని ఐమాక్స్ స్క్రీన్‌పై విడుదల కానుంది. తమిళ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది.
The very first person to watch the trailer of #L2E #EMPURAAN I will forever cherish what you said after watching it Sir! This meant the world to me! Fanboy forever! @rajinikanth #OGSuperstar pic.twitter.com/Dz2EmepqdZ
— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 18, 2025
మొదటి భాగం లూసిఫర్‌లో నటించిన మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ వంటి నటీనటులు ఈ సీక్వెల్‌లో కూడా కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇదే సినిమాను గాడ్ ఫాదర్ టైటిల్ తో రీమేక్ చేసి రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. అయితే గాడ్ ఫాదర్ సినిమాను మాత్రం డైరెక్టర్ మోహన్ రాజా తెరక్కించారు
ఎల్2 స్టోరీ విషయానికి వస్తే:
లూసిఫర్ మూవీలో మోహన్‌లాల్ స్టీఫెన్ గట్టుపల్లి అనే ఓ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడు. అయితే రాజకీయ నాయకుడు కాకముందు ఈ ప్రపంచాన్నే శాసించే ఓ మాఫియా లీడర్ అబ్రహాం ఖురేషిగా మారడం క్లైమాక్స్ లో చూపించారు. లూసిఫర్ సెకండ్ పార్ట్ లో అసలు ఒక సాధారణ వ్యక్తి అయిన స్టీఫెన్..మాఫియా లీడర్ అబ్రహాం ఖురేషి ఎలా అయ్యాడు? అతడు చేసిన పనులు ఏంటి? ఎందుకు రాజకీయ నాయకుడిగా మారాడు అని చూపించనున్నట్లు తెలుస్తుంది
అలాగే తన తమ్ముడైన టోవినో థామస్ ను ముఖ్యమంత్రిని చేసి విదేశాలకు వెళ్లిన లూసిఫర్ ఎవరు ? తండ్రి లాంటి వ్యక్తి నుంచి దూరమైన వ్యక్తి లూసిఫర్ గా ఎలా ఎదిగాడు ? అనేది ‘ఎల్2:ఎంపురాన్ సీక్వెల్లో చూపించనున్నారు.