రజినీకాంత్ సినిమాలు, పర్సనల్ లైఫ్ , పాలిటిక్స్.. ఏ విషయమైనా తమిళనాట హాట్ టాపిక్కే. ఆయన రీసెంట్ సినిమాకి సంబంధించి కూడా ఓ స్టోరీ లైన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రస్తు తం ఆయన ‘అన్నాత్తె ‘ సినిమాలో నటిస్తు న్న విషయం తెలిసిందే. అజిత్‌కి వరుస విజయాలు ఇచ్చిన శివ ఈ సినిమాకి దర్శకుడు. ఖుష్బూ, మీనాతో పాటు నయనతార, కీర్తి సురే ష్ కూడా నటిస్తు న్నారు. రజినీకాం త్ మార్క్ యాక్షన్ సినిమాల్లా కాకుం డా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఇప్పటికే క్లారి టీ ఇచ్చారు. అందుకు తగ్గట్టే కథ ఇదేనంటూ ఓ ఫ్యామిలీ స్టోరీ ప్రచారంలోకి వచ్చింది.
దాని ప్రకారం.. రజినీకాంత్‌కి ఇద్దరు కజిన్స్ ఖుష్బూ, మీనా . ఇద్దరూ రజినీని పెళ్లాడటానికి పోటీ పడుతుంటారు. కానీ ఒకరిని పెళ్లాడి మరొకరిని డిజప్పాయింట్ చేయడం ఇష్టలే క వారిద్దరినీ కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు రజినీ. ఇదంతా ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ప్రెజెంట్ స్టోరీలో ఆయన కూతురి గా కీర్తీ సురేష్ కనిపిస్తుంది. గతంలో తమని రజినీ పెళ్లి చేసుకోలేదు కనుక ఇప్పుడు ఆయన కూతురి నైనా తమ ఇంటి కోడలుగా (బహుశా తమ అన్న కొడుక్కి జంటగా కాబోలు) చేసుకునేందుకు ఖుష్బూ, మీనా మళ్లీ పోటీకి దిగుతారు. చివరికి ఎవరు నెగ్గారనేది మెయిన్ స్టోరీ అని తెలుస్తోంది. నయనతార పాత్ర ఏమిటనేది రివీల్ కాలేదు కానీ ‘నరసింహా’ తరహాలో ఇద్దరు నీలాంబరులుగా ఖుష్బూ, మీనా పాత్రలు ఉండబోతున్నాయని అర్థమవుతోంది.
కథలో నిజానిజాల మాటెలా ఉన్నా గతంలో వీరిద్దరూ రజినీతో కలిసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఆ క్రేజీ కాంబినేషన్స్‌ని రిపీట్ చేస్తూ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తీస్తున్నాడు శివ. దీపావళికి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ కరోనాతో సంక్రాంతికి కూడా పరిస్థితులు అనుకూలించేలా కనిపించక పోవడంతో సమ్మర్‌కి షిప్ట్ అయింది.