మెడికవర్ హాస్పిటల్స్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం 

మెడికవర్ హాస్పిటల్స్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం 

హనుమకొండ సిటీ, వెలుగు: మెడికవర్ హాస్పిటల్స్ లో  రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు గురువారం ప్రారంభం అయ్యాయి.  హనుమకొండ హంటర్ రోడ్డులోని 300 పడుకల హాస్పిటల్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అమలు చేయనున్నట్లు  తెలిపారు.  మెడికవర్ హాస్పిటల్ హెడ్ నమ్రత మాట్లాడుతూ..  ఉమ్మడి వరంగల్ జిల్లాలో  రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలు అందించడం శుభవార్త అన్నారు.  

.ఆరోగ్యశ్రీ ద్వారా గుండె చికిత్సలు, గుండె ఆపరేషన్లు, మూత్ర సంబంధిత సమస్యలకు  వైద్యం, కిడ్నీ ఆపరేషన్లు, డయాలిసిస్ సేవలు, మెదడు ఆపరేషన్లు, క్యాన్సర్ వైద్య సేవలు మెడికల్, సర్జికల్ అంకాలజీ తదితర సమస్యలకు వైద్యాన్ని పొందొచ్చన్నారు.