భద్రాచలం, వెలుగు : డీసీసీ ప్రెసిడెంట్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య యువసేన పేరిట భద్రాచలంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఆదివారం రాజీవ్‌గాంధీ అంతరాష్ట్ర క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. ఈ టోర్నీని మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య బ్యాటింగ్ చేసి ప్రారంభించారు.
టోర్నమెంట్లో మొత్తం 40 జట్లు పాల్గొంటున్నాయని పొదెం వీరయ్య యువసేన అధ్యక్షుడు తెల్లం నరేశ్ తెలిపారు. ఈనెల 13 వరకు పోటీలు జరుగుతాయని చెప్పారు. విజేతకు రూ.50వేలు, రన్నర్‌కు రూ.25వేలు ఇస్తామని వెల్లడించారు.