కామారెడ్డికి చేరిన రాజీవ్​ సందేశ్​ యాత్ర

కామారెడ్డికి చేరిన రాజీవ్​ సందేశ్​ యాత్ర

కామారెడ్డి​​​టౌన్​​, వెలుగు : రాజీవ్​ గాంధీ సందేశ్​ యాత్ర బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరింది. సందేశ్​ యాత్ర జ్యోతికి జిల్లా కేంద్రంలో డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు, మున్సిపల్​ చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ స్వాగతం పలికారు. 

కైలాస్​ శ్రీనివాస్​రావు మాట్లాడుతూ.. దేశంలో టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్​గాంధీకి దక్కిందన్నారు. లీడర్లు బీమ్​రెడ్డి, యాదవరెడ్డి, గొనే శ్రీనివాస్​, మోహన్​రెడ్డి, పంపరి లక్ష్మన్​, లక్కపత్ని గంగాధర్​, కౌన్సిలర్లు చాట్ల రాజేశ్వర్​, వంశీ, తదితరులు పాల్గొన్నారు.