నేడు రాజీవ్ విగ్రహావిష్కరణ

హాజరుకానున్న సీఎం రేవంత్, మంత్రులు

హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్ ముందు రాజీవ్​ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కూమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొననున్నారు. 

వాస్తవానికి గత నెల 20న రాజీవ్​ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం భావించింది. కానీ.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. స‌‌‌‌‌‌‌‌చివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గత ప్రభుత్వం భావించింది. అయితే, తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సెక్రటేరియెట్​బయట కాదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. 

సచివాలయం లోపల ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఇటీవలి భూమి పూజ కూడా చేశారు. డిసెంబర్​ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. ఒకవైపు దేశానికి ప్రధానులుగా పనిచేసిన  ఇందిరా గాంధీ, పీవీ విగ్రహాలు వరుసగా ఉండటంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అటు అమరవీరుల చిహ్నం, సెక్రటేరియెట్ మధ్యలో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.