హైదరాబాద్, వెలుగు: తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ నుంచి ఈ నెల 8న బయలుదేరిన రాజీవ్ జ్యోతి యాత్ర సోమవారం గాంధీ భవన్కు చేరుకుంది. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు ఈ యాత్రకు ఘన స్వాగతం పలికారు. ఏటా రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన మరణించిన శ్రీపెరంబుదూర్ నుంచి ఈ యాత్ర ప్రారంభమై, ఈ నెల 20 (రాజీవ్ గాంధీ జయంతి)న ఢిల్లీలోని రాజీవ్ వీర్ భూమికి చేరుకుంటుంది.
ఇందులో భాగంగానే ఈ జ్యోతి యాత్ర సోమవారం హైదరాబాద్కు చేరుకుంది. ఇక్కడి నుంచి నిజా మాబాద్, ఆదిలాబాద్, నాగ్పూర్ మీదుగా ఈ నెల 20న ఢిల్లీకి చేరుకోనుంది. అనంతరం ఈ జ్యోతిని సోనియా, రాహుల్ గాంధీకి యాత్ర బృందం అందజేయనుంది.