
రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘హోం టౌన్’. ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించాడు దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి పల్లే. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించిన ఈ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ కథ ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునేలా ఉంటుందని, ప్రసాద్ పాత్రలో రాజీవ్ కనకాల తనదైన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారని మేకర్స్ చెప్పారు. ఈ సిరీస్‌కు సినిమాటోగ్రాఫర్‌గా దేవ్ దీప్ గాంధీ కుండు పనిచేయగా, సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించాడు.