- అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్సభ్యులకు తెలంగాణ ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం చూ సేందుకు రావాలని మధ్యప్రదేశ్‌లోని అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ రాజేశ్వాంఖడేను తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ ఆహ్వానించారు. అంబేద్కర్ జన్మస్థలం మహులోని అంబేద్కర్ మెమోరి యల్ ట్రస్ట్‌ను ఆదివారం ఆయన సందర్శించి, నివాళి అర్పించారు.
ALSO READ :కస్టడీలో సెక్యూరిటీగార్డు మృతి.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఘటన
అంబేద్కర్ తండ్రి మధ్య ప్రదేశ్‌లోని మహు కంటోన్మెంట్ ప్రాంతంలోని కాలా ప్లాటూన్‌లో జవాన్‌గా పనిచేసినప్పుడు అంబేద్కర్ జన్మించారని తెలిపారు. అంబేద్కర్జన్మ స్థలాన్ని సందర్శించడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈయన వెంట మధ్యప్రదేశ్ బీఆర్ఎస్ నాయకుడు ఆనంద్ రాయ్ తదితరులు ఉన్నారు.