వచ్చే నెల 2న రాజీవ్ స్వగృహ లాటరీ

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలో 904 ఫ్లాట్లకు మే 2న లాటరీ తీయనున్నట్లు రాజీవ్ స్వగృహ ఎండీ విజయేంద్ర బోయి ప్రకటించారు. హిమాయత్​నగర్​లోని హౌసింగ్ ఆఫీస్ లో లాటరీ తీయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 904 ఫ్లాట్ల వేలానికి టోకెన్ అమౌంట్ కట్టాలని మార్చి 11న హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చింది.

మార్చి 25 దాకా గడువు విధించింది. రెస్పాన్స్ రాకపోవడంతో ఏప్రిల్ 15 దాకా గడువు పెంచింది. అయినా, పబ్లిక్ ఎవరూ ముందుకు రాలేదు. మొత్తం 904 ఫ్లాట్లలో సింగిల్ బెడ్​రూం 500 ఫ్లాట్స్ ఉన్నాయి. బండ్లగూడలో డబుల్, త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్లు మొత్తం అమ్ముడు పోయాయి. ఇక పోచారం ఫ్లాట్లు సిటీకి దూరంగా ఉండటం, అక్కడే సింగపూర్ టౌన్​షిప్​తో పాటు ప్రభుత్వం డబుల్ బెడ్​రూమ్ ఇండ్లు కడుతుండటంతో స్వగృహ ఫ్లాట్లు కొనేందుకు పబ్లిక్​ ముందుకు రావడం లేదు.