
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు సోమవారం అర్ధరాత్రితో ముగియనుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 90వేల అప్లికేషన్లు ఆన్లైన్లో రాగా, 30 వేలు నేరుగా వచ్చాయి. ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్న వారు మళ్లీ ఆఫీసుకు వచ్చి సర్టిఫికెట్లు ఇవ్సాల్సిన అవసరం లేదని, ఆన్ లైన్ పై అవగాహన లేని వారు బల్దియా వార్డు ఆఫీసులకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అంబేద్కర్జయంతి సందర్భంగా సెలవు ఉన్నా సోమవారం వార్డు ఆఫీసుల్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు రాజీవ్ యువవికాసం జిల్లా కన్వీనర్ రమేశ్ తెలిపారు.