
నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ,ఈడబ్ల్యుఎస్ వర్గాల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కింద ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రాజీవ్ యువవికాస పథకానికి ఏప్రిల్ 14 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లా మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో రూ 1.50,000 వార్షిక ఆదాయం, మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో రూ .2 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులని వెల్లడించారు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు, ఆయా యూనిట్లకు సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పాస్ బుక్, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ధ్రువపత్రం జత చేయాల్సి ఉంటుందని తెలిపారు.