రాజీవ్​ యువ వికాసం గడువు ఏప్రిల్​ 5

రాజీవ్​ యువ వికాసం గడువు ఏప్రిల్​ 5

కామారెడ్డి​, వెలుగు : రాజీవ్​ యువ వికాసం​ స్కీమ్​కు వీలైనంత ఎక్కువ మంది అప్లయ్​ చేసుకునేలా చూడాలని  అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.  సోమవారం సాయంత్రం  జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం, చీప్​ సెక్రటరీ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  రాష్ట్రంలో సుమారు  5 లక్షల మంది  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వెనుక బడిన నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఏప్రిల్ 5 వరకు అప్లయ్​ చూసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు.  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​,  జడ్పీ సీఈవో చందర్,  డీఆర్డీవో సురేందర్,   ఎస్సీ కార్పొరేషన్​ ఈడీ దయానంద్​ తదితరులు పాల్గొన్నారు.