ఒక్క యూనిట్‌ కు ముగ్గురు పోటీ .. నిజామాబాద్​ జిల్లాలో 1,03,558 అప్లికేషన్లు

ఒక్క యూనిట్‌ కు ముగ్గురు పోటీ .. నిజామాబాద్​ జిల్లాలో  1,03,558 అప్లికేషన్లు
  • రాజీవ్​ యువ వికాసం స్కీమ్‌కు ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో  1,03,558 అప్లికేషన్లు
  • ఉమ్మడి జిల్లాలో  మొత్తం టార్గెట్​యూనిట్లు  35,732
  • జనాభా ప్రాతిపదికన మండలాలకు యూనిట్ల కేటాయింపు

కామారెడ్డి,  నిజామాబాద్​, వెలుగు: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, సొంత వ్యాపారాలు వృద్ధి చేసుకునేందుకు స్టేట్ గవర్నమెంట్​రాజీవ్ యువ వికాసం​ స్కీమ్​ చేపట్టింది.  ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో భారీగా  అప్లికేషన్లు వచ్చాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు కలిపి మొత్తం 1,03,558 అప్లికేషన్లు వస్తే, జనాభా ప్రాతిపదికన ఉమ్మడి జిల్లాకు 35,732 యూనిట్లు టార్గెట్‌గా కేటాయించారు.  ఈ లెక్కన ఒక్కో యూనిట్‌కు ముగ్గురు వ్యక్తులు పోటీపడుతున్నారు. చాలా ఏండ్ల తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉపాధి అవకాశాలకు ఆర్థిక సాయం, రుణాలు ఇస్తుండటంతో భారీగా అప్లికేషన్లు వచ్చాయి.  ఈ నెల 14 తోనే అప్లికేషన్ల స్వీకరణ పక్రియ కంప్లీట్ కావటంతో ఇక తదుపరి పక్రియపై అధికారులు ఫోకస్​ చేశారు. 

మండలాల వారీగా కేటాయింపు

జిల్లాలో జనాభాకు అనుగుణంగాఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, ఈబీసీ, ఈడబ్యూఎస్​లకు యూనిట్లను కేటాయించారు.  జిల్లాకు కేటాయించిన యూనిట్ల మొత్తం ఆయా మండలాల్లో  వర్గాల వారీగా ఉన్న జనాభాకు అనుగుణంగా విభజించారు. మండలాల వారీగా వచ్చిన అప్లికేషన్లు కేటాయించబడిన యూనిట్లు సంబంధిత బ్యాంక్​ల వారీగా  కేటాయింపు ప్రక్రియ షురూ అయింది. లబ్ధిదారుల సెలక్షన్​, ఆర్థికసాయం, రుణాలు ఇప్పించటం, సబ్సిడీల కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్​చైర్మన్, డీఆర్డీఏ పీడీ కన్వీనర్, ఆయా శాఖల అధికారులు, బ్యాంక్​అధికారులు మెంబర్లుగా ఉంటారు.  

మండల స్థాయిలో ఎంపీడీవో కన్వీనర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖ అధికారులు,  మండల పరిధిలోని బ్యాంక్​అధికారులు మెంబర్లుగా, మున్సిపల్​పరిధిలో కమిషనర్​కన్వీనర్‌‌గా వ్యవహరిస్తారు.  అప్లికేషన్ల పరిశీలన ప్రక్రియ షురూ అయింది. ఈ స్కీమ్​లో ఫస్ట్​ ప్రయార్టీ వితంతులు, ఒంటరి మహిళలు, నిరుద్యోగులు, దివ్యాంగులు, నిరుద్యోగులకు ఇస్తారు. అప్లికేషన్ల పరిశీలన, లబ్ధిదారుల సెలక్షన్​, శాంక్షన్​ ప్రక్రియలు మే నెల మధ్య వరకు కంప్లీట్​ చేయనున్నారు.  రాష్ర్ట అవతరణ దినోత్సవం జూన్​2 లబ్ధిదారులకు సెలక్షన్​ పత్రాలు అందించనున్నారు. 

మండలాల వారీగా, బ్యాంక్​ల వారీగా కేటాయింపులపై పరిశీలన 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్​, ఈబీసీ, ఈడబ్యూఎస్​ వర్గాలకు జిల్లాలో ఉన్న ఆ వర్గాల జనాభా ప్రాతిపధికన యూనిట్లను కేటాయించారు.   నిజామాబాద్​ జిల్లాకు మొత్తం  యూనిట్లు 22, 285 కేటాయిస్తే  అప్లికేషన్లు 58,896 వచ్చాయి.  కామారెడ్డి జిల్లాకు  13,447 యూనిట్లు కేటాయించగా ఆయా వర్గాల నుంచి మొత్తం అప్లీకేషన్లు 44,662 వచ్చాయి.   శనివారం ఆయా శాఖల అధికారులు బ్యాంక్​ల వారీగా  యూనిట్ల కేటాయింపుపై  చర్యలు చేపట్టారు.  మండలంలో ఉన్న జనాభా, యూనిట్లు, ఆ మండల పరిధిలో ఉన్న బ్యాంక్​ శాఖలకు అనుగుణంగా యూనిట్లు బ్యాంక్​లకు కేటాయిస్తున్నారు. 

త్వరలోనే  మీటింగ్​లు

కామారెడ్డి జిల్లాలో త్వరలోనే  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు, మండలాల ఎంపీడీవోలు,  బ్యాంక్​ అధికారులతో  కలెక్టర్​  మీటింగ్​ నిర్వహించనున్నారు.  లబ్ధిదారుల సెలక్షన్​,  ఆర్థిక సాయం, సబ్సిడీ, బ్యాంక్​ నుంచి రుణాల వంటి వాటిపై సూచనలు ఇవ్వనున్నారు.  జిల్లాలో ఇప్పటికే  సంబంధిత శాఖల అధికారులు  అప్లీకేషన్ల పరిశీలన,  మండలాల వారీగా, బ్యాంక్​ల వారీగా యూనిట్ల విభజన పక్రియ చేపట్టారు.  రూ. 50వేల లోపు ఉన్న  యూనిట్లకు ఫస్ట్  శాంక్షన్​ చేసే అవకాశముంది.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు, లీడ్​ బ్యాంక్​ అధికారులు చర్చించారు. 

నిజామాబాద్​ జిల్లా...

శాఖ       మొత్తం    టార్గెట్  యూనిట్ల
     అప్లీకేషన్లు              సంఖ్య
ఎస్సీ    10,845    5,817
బీసీ    29,638    7,969
ఎస్టీ     4,590    3,088
మైనార్టీ    12,253     2,911
క్రిస్టియన్​    253    174
ఈబీసీ,    1,317    2,326
ఈడబ్యూఎస్​
మొత్తం    58,896    22,285

కామారెడ్డి  జిల్లా.. 

శాఖ     మొత్తం           టార్గెట్  యూనిట్ల
        అప్లీకేషన్లు         సంఖ్య
ఎస్సీ    8,335    4,104
బీసీ    23,977    4,698
ఎస్టీ     4,580    2,356
మైనార్టీ     6,663        973
క్రిస్టియన్​    61    44
ఈబీసీ,    1,046    1,272
ఈడబ్యూఎస్
మొత్తం    44,662    13,447