బోధన్, వెలుగు : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే షకీల్ అమేర్ చెప్పారు. శుక్రవారం బోధన్ మండలంలోని పెంటక్యాంపు, ఖాజాపూర్, ఊట్పల్లి, భూలక్ష్మిక్యాంప్, మావందికుర్దు, పత్తేపూర్ గ్రామాలలో పంచాయతీ భవనాలు, రాజీవ్నగర్తాండలో ఎస్పీ కమ్యూనిటీ హాల్, సొసైటీ గోడౌన్ను ప్రారంభించారు. ఏరాజ్పల్లి, ఊట్పల్లిలో పల్లె దవాఖానాలు ఓపెన్ చేశారు. సాలూర గిద్దె చెరువులో చేపపిల్లలను వదిలిపెట్టారు. పెగడపల్లిలో పార్టీ ఆఫీస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఖజాపూర్లో ముస్లింల శ్మాశనవాటిక కోసం హన్మంతు పటేల్ విరాళంగా భూమి ఇవ్వడంతో అభినందించారు. బోధన్ మండల ఎంపీపీ బుద్దె సావిత్రి, జడ్పీటీసీ లక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్ గంగారెడ్డి, మాజీ రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ రాజేశ్వర్ పాల్గొన్నారు.