రికార్డింగ్ డివైజ్ పేరుతో టైమ్ బాంబు పార్శిల్‌.. షాపులో చెలరేగిన మంటలు

రికార్డింగ్ డివైజ్ పేరుతో  టైమ్ బాంబు పార్శిల్‌.. షాపులో చెలరేగిన మంటలు

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలో పార్శిల్‌లో అమర్చిన టైమ్ బాంబు పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ బృందం.. ముగ్గురిని అరెస్టు చేసింది. స్కార్ఫ్‌తో ముఖాన్ని కప్పుకున్న ఓ మహిళ దుకాణం మూసేయగానే పేలిన బాక్స్‌ను వదిలేసి భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. వ్యాపార గొడవల కారణంగా 6 రోజుల క్రితం మొబైల్ షాపులో టైంబాంబ్ అమర్చినట్లు పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన కలరామ్‌ గత కొన్ని రోజుల నుంచి భావ్‌రామ్ (అతని దుకాణం దగ్ధమైంది) దుకాణాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని దురుద్దేశం తెలిసి బావ శ్రవణ్‌తో కలిసి అతని దుకాణాన్ని తగలబెట్టాలని పథకం వేశాడు. అనంతరం శ్రవణ్ తన పరిచయస్తులలో ఒకరైన డాలీని సంప్రదించాడు.  డాలీ డెలివరీ పర్సన్ గా చేస్తోంది. ఇదే అదనుగా చేసుకున్న కలరామ్ .. రికార్డింగ్ డివైజ్ పేరుతో డాలీని టైమ్ బాంబు ఉన్న పార్శిల్‌ను భావ్ రామ్ షాపుకు డెలివరీ చేయమని చెప్పాడు. 

మొదట్లో ఈ ఘటనను అందరూ అగ్నిప్రమాదంగా భావించారు. కానీ సీసీటీవీని పరిశీలించగా ఆ రోజు ఓ మహిళ షాపులో రహస్యంగా పార్శిల్‌ను పెట్టి వెళ్లిందని, ఆ తర్వాత రాత్రి అది పేలిపోయి షాపులో మంటలు చెలరేగాయని తేలింది. అనంతరం విచారణలో డాలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.