‘మహా’ ఎలక్షన్స్: అసెంబ్లీ ఎన్నికల బరిలో రాజ్ కుమార్ థాక్రే కుమారుడు

‘మహా’ ఎలక్షన్స్: అసెంబ్లీ ఎన్నికల బరిలో రాజ్ కుమార్ థాక్రే కుమారుడు

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ చీఫ్ రాజ్ కుమార్ థాక్రే కుమారుడు రాజకీయ అరంగ్రేటం చేయబోతున్నాడు. రాజ్ కుమార్ థాక్రే కుమారుడు అమిత్ థాక్రే తొలిసారి ప్రతక్ష్య ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు మంగళవారం (అక్టోబర్) ఎంఎన్ఎస్ పార్టీ వెల్లడించింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంఎన్ఎస్ ఇవాళ 45 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ లిస్ట్‎లో అమిత్ థాక్రే టికెట్ దక్కింది. 

ALSO READ | శాంతి స్థాపనకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధం: ప్రధాని మోడీ

ముంబైలోని మహిమ్ అసెంబ్లీ స్థానం అమిత్ థాక్రే బరిలోకి దిగనున్నట్లు ఎంఎన్ఎస్ అనౌన్స్ చేసింది. కాగా, 2024, అక్టోబర్ 15వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉండగా.. 2024, నవంబర్ 20వ తేదీన సింగల్ ఫేజ్‎లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. నవంబర్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి.

మహారాష్ట్ర ఎన్నికల పూర్తి షెడ్యూల్:

  • నోటిఫికేషన్ వెలువడు తేదీ: 22/10/ 2024
  • నామినేషన్ల దాఖలకు చివరి తేదీ: 29/10/ 2024
  • నామినేషన్ల పరిశీలన: 30/10/ 2024
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 04/11/ 2024
  • పోలింగ్ జరుగు తేదీ: 20/11/ 2024
  • కౌంటింగ్ తేదీ: 23/11/ 2024