టైటిల్: స్త్రీ2
ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్టర్: అమర్ కౌశిక్
కాస్ట్: రాజ్‌కుమార్ రావు, శ్రద్ధాకపూర్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానా, తమన్నా, వరుణ్ ధావన్, అక్షయ్‌కుమార్
చెడుపై మంచి గెలిచిందనే కాన్పెప్ట్తో వచ్చిన సినిమాలు చాలావరకు సక్సెస్ అవుతాయి. ఆ కాన్సెప్ట్‌తోనే వచ్చింది స్త్రీ2 సినిమా. అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాను రెంట్ బేస్ మీద చూడొచ్చు. కథలోకి వెళ్తే... చందేరీ అనే ఊళ్లో ఒక్కొక్కరుగా అమ్మాయిలు మాయం అవుతుంటారు. గుర్తు తెలియని వ్యక్తులెవరో అమ్మాయిల్ని మాయం చేస్తున్నారని అనుమానిస్తారు ఆ ఊరి జనాలు. అదే ఊళ్లో ఉండే విక్కీ (రాజ్ కుమార్ రావు) తాను ప్రేమించిన అమ్మాయి (శ్రద్ధాకపూర్) కోసం తెగ కలలు కంటుంటాడు. ఒకరోజు రుద్ర (పంకజ్ త్రిపాఠి)కి ‘అతను మళ్లీ వస్తున్నాడు’ అంటూ చందేరీ పురాణంలోని కొన్ని పేజీలతో ఉన్న కవర్ ఒకటి అందుతుంది.
అదే టైంలో విక్కీ ఫ్రెండ్ బిట్టు (అపర్శక్తి ఖురానా) ప్రేమించిన అమ్మాయి చిట్టి (అన్యసింగ్)ను సర్కట(తల మొండెం వేరుగా ఉన్న ఒక ఆకారం) అనే దెయ్యం తీసుకెళ్తుంది. దాంతో చిట్టిని కాపాడేందుకు విక్కీ, బిట్టు, రుద్ర, జనా (అభిషేక్ బెనర్జీ) రంగంలోకి దిగుతారు. సర్కటను ఎదుర్కొనేందుకు వెళ్లిన విక్కీ గ్యాంగ్ ఏం సాహసాలు చేశారు. విక్కీ ప్రేమించిన అమ్మాయి విక్కీకి ఎలా సాయపడింది? అన్నది కథ. సర్కట ఉన్న ప్రాంతానికి వెళ్లిన విక్కీ దాదాపు ప్రాణాలమీదకు తెచ్చుకుంటాడు. అప్పుడు శ్రద్ధ వచ్చి విక్కీని కాపాడే సీన్ సినిమాకే హైలైట్. అప్పటివరకు ఒక సాధారణ ప్రేమికురాలిగా కనిపించిన ఆమె ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి వస్తుంది. హారర్ కామెడీ చిత్రాల్లో ఇది పర్ఫెక్ట్ మూవీ.