
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే అధిక మెజార్టీతో మంత్రి హరీశ్‌రావు గెలుస్తున్నాడని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేటలో హరీశ్ రావు పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో మెజార్టీని పెంచుకుంటూ గెలుపొందుతున్నాడని, ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రికార్డు మెజార్టీ సాధించడం ఖాయమన్నారు. ఎ
న్నికల ప్రచారం సందర్భంగా తమకు ప్రతి ఇంట్లో అపూర్వ స్పందన లభించిందన్నారు. అన్ని కుల సంఘాలు, అసోసియేషన్ల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా హరీశ్ రావుకు మద్దతు తెలిపారన్నారు. స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గినప్పటికీ హరీశ్ రావుకు మాత్రం ఓట్లు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జి.మోహన్ లాల్, మెరుగు మహేశ్, వడ్లకొండ సాయి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి, పాల సాయిరామ్ పాల్గొన్నారు.