కల్వకుంట్ల కుటుంబం అవినీతి ఢిల్లీ వరకు చేరింది: రాజ్ నాథ్ సింగ్

జమ్మికుంట బహిరంగ సభలో కేసీఆర్ పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే పోరాడలేదని విమర్శించారు. తెలంగాణలో రాష్ట్ర సర్కార్ ప్రైవేట్ లిమిటెడ్ గా మారిందని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని.. కల్వకుంట్ల కుటుంబ అవినీతి ఢిల్లీ వరకు చేరిందని విమర్శించారు.

కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశమంతా చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణలో అన్నీ ఉన్నా కేసీఆర్ అభివృద్ధి చేయలేకపోయారని మండిపడ్డారు. తెలంగాణలో 9ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ వీరులను కన్నగడ్డ అని అన్నారు. జమ్మికుంటలో బీజేపీ చైతన్యం కనిపిస్తోందని రాజ్ నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. 

అప్పట్లో కాంగ్రెస్ తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ వైఫల్యంతో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు నెలకొన్నాయని చెప్పారు. బీజేపీ ఇచ్చిన 3 రాష్ట్రాలు అభివృద్ధిలో పయనిస్తున్నాయని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.